KCR With Deve Gowda : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త వింటారు- దేవెగౌడతో భేటీ తర్వాత కేసీఆర్

దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని చెప్పారు. కచ్చితమైన మార్పు ఉంటుందని... దాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.(KCR With Deve Gowda)

KCR With Deve Gowda : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త వింటారు- దేవెగౌడతో భేటీ తర్వాత కేసీఆర్

Kcr With Deve Gowda

KCR With Deve Gowda : జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్.. పలు పార్టీల నేతలను కలుసుకుంటున్నారు. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ పలు పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. దేశ రాజకీయాలపై కీలక చర్చలు జరిపారు.

తాజాగా కేసీఆర్ బెంగళూరు వెళ్లారు. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని కలిశారు. ఈ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని చెప్పారు. కచ్చితమైన మార్పు ఉంటుందని… దాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. అంతేకాదు.. రెండు, మూడు నెలల్లో తాను ఒక సంచలన వార్తను చెపుతానని కేసీఆర్ అన్నారు. కాగా, దేవెగౌడ, కుమారస్వామితో భేటీలో కేంద్ర విధానాలు, దేశంలో ప్రస్తుత పరిస్థితులు, జాతీయ రాజకీయాల్లో రావాల్సిన మార్పులు, కర్ణాటక రాజకీయాలపై కేసీఆర్ చర్చించారు.(KCR With Deve Gowda)

PM Narendra Modi : కుటుంబ పాలన అంటూ సీఎం కేసీఆర్ పై ప్రధాని మోడీ ఘాటు విమర్శలు..

”మన దేశంలో ఇప్పటివరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. ఎందరో ప్రధానులు వచ్చారు. కానీ దేశ పరిస్థితులు మాత్రం బాగుపడలేదు. మనకంటే వెనుకబడి ఉన్న చైనా 16 ట్రిలియన్ ఎకానమీగా ఎదిగింది. మనం మాత్రం 5 ట్రిలియన్ డాలర్ల వద్దే ఉన్నాం. దేశంలో మంచి నాయకులు, మంచి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు అవుతోంది. అయినప్పటికీ మనం ఇప్పటికీ తాగునీరు, సాగునీరు, కరెంట్ సమస్యలతో బాధపడుతున్నాం.(KCR With Deve Gowda)

మన దేశంలో ద్రవ్యోల్బణం రోజురోజుకు పెరుగుతోంది. జీడీపీ పడిపోయింది. కంపెనీలు మూత పడుతున్నాయి. రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. దేశంలో బడుగు, బలహీనవర్గాలు ఎవరూ సంతోషంగా లేరు. రైతులు, దళితులు, ఆదివాసీలు అంతా బాధలోనే ఉన్నారు. మరి ఆనందంగా ఉన్నది ఎవరు? రోజురోజుకి పరిస్థితులు దిగజారిపోతున్నాయి.(KCR With Deve Gowda)

Minister Gangula Counter : ఆ కుటుంబం ఉద్యమం చేయకపోతే తెలంగాణ వచ్చేదా? ప్రధాని వ్యాఖ్యలకు గంగుల కౌంటర్

కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తుంది? ఏ ప్రభుత్వం రాదు? అన్నది ప్రశ్న కాదు. కాంగ్రెస్ ది వస్తుందా? కాంగ్రెస్ లేనిది వస్తుందా? బీజేపీ ప్రభుత్వం వస్తుందా? ఎవరి ప్రభుత్వం వస్తుంది? అనేది ప్రశ్న కాదు. త్వరలో ఒక ఉజ్వల భారత్ ఏర్పడుతుంది అనేది మాత్రం నేను కచ్చితంగా చెప్పగలను. ఉజ్వల్ హిందుస్తాన్ తయారు చేయడానికి అవసరమైన కృషి చేయాల్సి ఉంది. జర్నలిస్టులు కూడా ఇందులో భాగం కావాలి” అని కేసీఆర్ అన్నారు.

రెండు మూడు నెలల్లో సంచలన వార్త వింటారు అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కేసీఆర్ చెప్పబోయే ఆ సంచలన వార్త ఏమై ఉంటుంది? అనేది ఆసక్తికరంగా మారింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సై అంటే సై అంటున్నారు కేసీఆర్. ప్రధాని మోదీ పాలనపై ఇప్పటికే బహిరంగ విమర్శలు చేశారు. మరోవైపు జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. పలు పార్టీల నేతలను వరుసగా కలుస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ కామెంట్స్ రాజకీయాల్లో మరింత వేడి పెంచాయి.(KCR With Deve Gowda)

అటు, హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. కుటుంబ పాలన అంటూ కేసీఆర్ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఓ కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయ్యింది, ఓ కుటుంబం దోచుకోవాలని చూస్తోంది అంటూ ధ్వజమెత్తారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. అంతేకాదు, తెలంగాణలో మార్పు తధ్యమని, అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు.