Collector Wife Delivery In Govt Hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం .. ఆపరేషన్ చేసి డెలివరీ చేసిన వైద్యులు

భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భార్య, ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ త్రిపాఠి సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియాఆస్ప్రతిలో మగ బిడ్డను జన్మనిచ్చారు.

Collector Wife Delivery In Govt Hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం .. ఆపరేషన్ చేసి డెలివరీ చేసిన వైద్యులు

district collectaret wife

Collector Wife Delivery In Govt Hospital: ప్రభుత్వ ఆస్పత్రులకు వైద్యకోసం వచ్చినవారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. దీనికితోడు ప్రభుత్వాస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక దృష్టిసారించడంతో పాటు ఆమేరకు సౌకర్యాలనుసైతం కల్పిస్తోంది. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగాయి. ఇదిలాఉంటే ఐఏఎస్ స్థాయి, ఇతర స్థాయిల్లో పలువురు అధికారులు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రిలోనే పండంటి బిడ్డలకు జన్మనిస్తున్నారు. తాజాగా ములుగు అదనపు కలెక్టర్‌ త్రిపాఠి సోమవారం భూపాలపల్లిలోని ప్రభుత్వాసుపత్రిలో తన బిడ్డకు జన్మనిచ్చి ఆదర్శంగా నిలిచారు.  భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భార్య, ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ త్రిపాఠి సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియాఆస్ప్రతిలో మగ బిడ్డను జన్మనించారు.

Jios Cheap Laptop : ముకేశ్ అంబానీ మ‌రో కీల‌క నిర్ణ‌యం.. అతి త‌క్కువ ధ‌రకే జియో లాప్‌టాప్ కం టాబ్లెట్‌!

సోమవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి అడ్మిట్ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంజీవయ్య ఆధ్వర్యంలో సాధారణ డెలివరీ కోసం ప్రయత్నించినప్పటికీ శిశువు బరువు ఎక్కువగా ఉండటంతో సాధారణ డెలివరీ చేయడం సాధ్యం కాలేకపోయిందని సూపరిండెంట్ తెలిపారు. హాస్పటల్లో గైనకాలజిస్ట్ డాక్టర్లు శ్రీదేవి,లావణ్య, సంధ్యారాణి, విద్య ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు. త్రిపాఠి పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. ఇదిలాఉంటే.. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీతో జిల్లా ప్రజలకు కలెక్టర్ దంపతులు ఆదర్శంగా నిలిచారు. స్థానిక ప్రజలు కలెక్టర్ దంపతుల తీరుపై ప్రశంసలజల్లు కురిపిస్తున్నారు. గతంలో పలువురు ఐఏఎస్ అధికారుల సతీమణులు ప్రభుత్వాస్పత్రిలోనే ప్రసవం పొందారు. గతేడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ సతీమణి మాధవి ప్రభుత్వాసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది.