Jios Cheap Laptop : ముకేశ్ అంబానీ మ‌రో కీల‌క నిర్ణ‌యం.. అతి త‌క్కువ ధ‌రకే జియో లాప్‌టాప్ కం టాబ్లెట్‌!

4జీ ఫీచ‌ర్ ఫోన్, స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిన రిల‌య‌న్స్ జియో.. ఇప్పుడు 5జీ సేవ‌ల్లోకి ఎంట‌ర‌వుతున్న వేళ‌ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఎంబీడెడ్ 4జీ సిమ్ కార్డ్‌తో అతి త‌క్కువ ధ‌ర 184 డాల‌ర్ల (రూ.15 వేలు)కు లాప్‌టాప్ డెవ‌ల‌ప్ చేస్తుందని జియో స‌న్నిహిత వ‌ర్గాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. జియో లాప్‌టాప్‌ను జియో బుక్ అని పిలుస్తార‌ని తెలుస్తోంది.

Jios Cheap Laptop : ముకేశ్ అంబానీ మ‌రో కీల‌క నిర్ణ‌యం.. అతి త‌క్కువ ధ‌రకే జియో లాప్‌టాప్ కం టాబ్లెట్‌!

Jios Cheap Laptop

Jios Cheap Laptop : రిల‌య‌న్స్ అధినేత ముకేశ్ అంబానీ మ‌రో సంచ‌ల‌నం సృష్టించేందుకు సిద్ధం అవుతున్నారు.  4జీ ఫీచ‌ర్ ఫోన్, స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిన రిల‌య‌న్స్ జియో.. ఇప్పుడు 5జీ సేవ‌ల్లోకి ఎంట‌ర‌వుతున్న వేళ‌ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఎంబీడెడ్ 4జీ సిమ్ కార్డ్‌తో అతి త‌క్కువ ధ‌ర 184 డాల‌ర్ల (రూ.15 వేలు)కు లాప్‌టాప్ డెవ‌ల‌ప్ చేస్తుందని జియో స‌న్నిహిత వ‌ర్గాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. జియో లాప్‌టాప్‌ను జియో బుక్ అని పిలుస్తార‌ని తెలుస్తోంది. అంతే కాకుండా జియో లాప్‌టాప్ ఆల్ట‌ర్నేటివ్‌గా టాబ్లెట్‌గా కూడా ఉప‌యోగించవచ్చు.

జియో బుక్ కోసం క్వాల్‌కామ్‌, మైక్రోసాఫ్ట్ సంస్థ‌ల‌తో రిల‌య‌న్స్ జియో భాగ‌స్వామిగా మారింది. జియో లాప్‌టాప్ కోసం ఆర్మ్ లిమిటెడ్ సంస్థ నుంచి క్వాల్‌కామ్ చిప్‌సెట్ త‌యారు చేస్తుందని సమాచారం. యాప్ స‌పోర్ట్‌తో మైక్రోసాఫ్ట్ విండోస్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ అందిస్తుంద‌ని తెలుస్తోంది. ఇదే లాప్‌టాప్ ఆల్ట‌ర్నేటివ్‌గా టాబ్లెట్‌గా కూడా ఉంటుంది. జియో లాప్‌టాప్‌పై స్పందించ‌డానికి రిల‌య‌న్స్ జియో అధికార ప్ర‌తినిధి స్పందించ‌లేదు.

Reliance Jio Data Plans : రిలయన్స్ జియో అదిరే ప్రీపెయిడ్ ప్లాన్లు.. ఫ్రీగా ఓటీటీ స్ట్రీమింగ్, మరెన్నో డేటా బెనిఫిట్స్..!

భార‌త్‌లో రిల‌య‌న్స్ జియో 42 కోట్ల మందికి పైగా క‌స్ట‌మ‌ర్లను క‌లిగి ఉంది. గూగుల్ స‌హ‌కారంతో 5జీ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు రిల‌య‌న్స్ జియో సిద్ధం అవుతుంది. ఇక కాంట్రాక్ట్ మాన్యుఫాక్చ‌ర‌ర్ ఫ్లెక్స్‌.. స‌ద‌రు లాప్‌టాప్‌ను త‌యారు చేస్తోంది. భార‌త్‌లోనే జియో లాప్‌టాప్ ఉత్ప‌త్తి చేస్తార‌ని స‌మాచారం. దేశీయ లాప్‌టాప్ మార్కెట్‌లో జియో బుక్ 15 శాతం వాటా పొందుతుంద‌ని ఐడీసీ కౌంట‌ర్ పాయింట్ అన‌లిస్ట్ త‌రుణ్ పాఠ‌క్ అంచ‌నా వేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.