తళతళలాడాలి : త్వరలో రూ.20 కొత్త నోటు

నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) పలు కొత్త నోట్లు విడుదల చేసింది. సరికొత్త ఫీచర్లు, లోగోలు, సెక్యూరిటీ ప్రమాణాలతో ఫ్రెష్ లుక్‌తో పాత వాటి స్థానంలో కొత్త కరెన్సీ నోట్లు తీసుకొచ్చింది.

  • Published By: sreehari ,Published On : December 28, 2018 / 09:50 AM IST
తళతళలాడాలి : త్వరలో రూ.20 కొత్త నోటు

నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) పలు కొత్త నోట్లు విడుదల చేసింది. సరికొత్త ఫీచర్లు, లోగోలు, సెక్యూరిటీ ప్రమాణాలతో ఫ్రెష్ లుక్‌తో పాత వాటి స్థానంలో కొత్త కరెన్సీ నోట్లు తీసుకొచ్చింది.

నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) పలు కొత్త నోట్లు విడుదల చేసింది. సరికొత్త ఫీచర్లు, లోగోలు, సెక్యూరిటీ ప్రమాణాలతో ఫ్రెష్ లుక్‌తో పాత వాటి స్థానంలో కొత్త కరెన్సీ నోట్లు తీసుకొచ్చింది. ఇప్పటికే ఆర్బీఐ రూ.10, 50, 100, 200, 500, 2000 నోట్లను విడుదల చేసింది. తాజాగా 20రూపాయల నోట్లపై ఆర్బీఐ ఫోకస్ చేసింది. కొత్తగా 20రూపాయల నోటును తీసుకురావాలని నిర్ణయించింది. మహాత్మా గాంధీ సిరీస్‌లో అదనపు ఫీచర్లు, భద్రతా ప్రమాణాలతో ఈ నోటును మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే ఈ రూ.20 నోటును మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. 

మహాత్మాగాంధీ సిరీస్‌లో ఆర్బీఐ ఇప్పటికే కొత్త నోట్లు తీసుకొచ్చింది. 2016 నుంచి ఈ కొత్త నోట్ల విడుదలను ఆర్బీఐ కొనసాగిస్తోంది. గతంలో ఉన్న వాటికి పూర్తి భిన్నమైన కలర్లు, సైజులతో కొత్త నోట్లు వచ్చాయి. ఇప్పుడు రూ.20 నోటు కూడా వాటి సరసన చేరనుంది. కొత్త కరెన్సీ వచ్చినా.. పాత 20రూపాయల నోట్లు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. ఆర్బీఐ లెక్కల ప్రకారం 2016, మార్చి 31 నాటికి 492 కోట్ల రూ.20 నోట్లు మార్కెట్లో చెలామణి అవుతున్నాయి.  2018, మార్చి నాటికి వీటి సంఖ్య వెయ్యి కోట్లకు చేరింది. మొత్తం కరెన్సీలో రూ.20 నోట్ల వాటా 9.8 శాతంగా ఉంది.