Telangana CS Somesh Kumar : తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌కు కరోనా పాజిటివ్

తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో హోంఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు సోమేశ్ కుమార్ వెల్లడించారు.

Telangana CS Somesh Kumar : తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌కు కరోనా పాజిటివ్

సీఎస్ సోమేశ్ కుమార్‌కు కరోనా పాజిటివ్

CS Somesh Kumar : తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో హోంఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు సోమేశ్ కుమార్ వెల్లడించారు. నిన్న, మొన్న తనతో కాంటాక్ట్‌ అయినవారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సోమేశ్ కుమార్ సూచించారు. తనకి తక్కువ లక్షణాలున్నాయని.. అందుకే ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నానని ఆయన వెల్లడించారు.

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,097 కొత్త పాజిటివ్‌లు నమోదు అయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 3,13,237కు చేరింది. మరో 6 మరణాలు నమోదయ్యాయి. దాంతో మరణాల సంఖ్య 1,723గా నమోదైంది.

కొత్తగా 268 మంది కరోనాకు చికిత్సతో మొత్తంగా 3,02,768 మంది కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యంలో 37,338 ప్రైవేటులో 5,732 టెస్టులు నిర్వహించారు. మొత్తం నిర్ధారణ పరీక్షల సంఖ్య 1,04,35,997కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 302 కొత్త కేసులు నమోదయ్యాయి.

మహబూబ్‌నగర్‌లో 22, ఆదిలాబాద్‌లో 24, జగిత్యాలలో 32, కామారెడ్డిలో 28, కరీంనగర్‌లో 38, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 138, నిర్మల్‌లో 42, సంగారెడ్డిలో 52, వరంగల్‌ నగర జిల్లాలో 28, నిజామాబాద్‌లో 77, రంగారెడ్డిలో 116 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో టీకాల వృథా 2.77 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.