కరోనా వెళ్లిపో : హమ్మయ్య తెలంగాణలో కేసులు తగ్గుతున్నాయి

కరోనా వెళ్లిపో : హమ్మయ్య తెలంగాణలో కేసులు తగ్గుతున్నాయి

కరోనా వెళ్లిపో ఇక..చాలు అంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. అనుకున్నట్లుగానే వైరస్ తగ్గుముఖం పడుతోందని అనుకోవచ్చు.  ఎందుకంటే..కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతుండడమే. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, వైరస్ వ్యాప్తి చెందకుండా..పోరాడుతున్న వారి కృషి ఫలితంగానే వైరస్ తగ్గుముఖం పడుతోంది. 2020, ఏప్రిల్ 25వ తేదీ శనివారం ఏడు కేసులు మాత్రమే నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 16 మంది వైరస్ బారి నుంచి పూర్తిగా కొలుకుని ఇంటిబాట పట్టారు. మొత్తం కరోనా కేసులు 990గా ఉన్నాయి.

శనివారం సాయంత్రం GHMC పరిధిలో 06, వరంగల్ అర్బన్ ఒకటి కేసులు నమోదయ్యాయి. గత రెండు రోజులుడి 20 పాజిటివ్ కేసులు రాష్ట్రంలో వెలుగు చూశాయి. 990 కేసులకు చేరుకున్నట్లైంది. డిశ్చార్జి అయిన వారి సంఖ్య 307కి తగ్గింది. శుక్ర, శనివారాల్లో 55 మంది కోలుకున్నట్లు వెల్లడించారు అధికారులు. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండడంతో కంటైన్ మెంట్ జోన్లను అధికారులు తగ్గించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

వరంగల్ అర్బన్ జిల్లాలో శనివారం 13 సంవత్సరాల బాలుడికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లాలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇతడిని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఎర్రబెల్లి తండాను కంటైన్ మెంట్ ప్రాంతంగా ప్రకటించారు.

మొత్తం కేసులు : 990
కోలుకున్న వారు : 307
మృతులు : 25

శనివారం (25-04-2020)
GHMC : 06
వరంగల్ అర్బన్ : 0