కరోనా వైరస్ : వారం..పది రోజులే కీలకం..తర్వాత

  • Published By: madhu ,Published On : March 28, 2020 / 10:13 AM IST
కరోనా వైరస్ : వారం..పది రోజులే కీలకం..తర్వాత

కరోనా వైరస్ విజృంభించి రోజులు గడుస్తున్నాయి. కేసుల మీద కేసులు వెలుగు చూస్తున్నాయి. భారతదేశంలో 2020, మార్చి 28వ తేదీ శనివారం వరకు 800పైగానే కేసులు నమోదవుతున్నాయి. 21 మంది దాక చనిపోయారు. కేరళ రాష్ట్రంలో మొట్టమొదటి మృతి చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం కేసులు రిజిష్టర్ అవుతున్నాయి. విదేశాల నంచి వచ్చిన వారిలో మొదట ఈ లక్షణాలు కనిపించాయి. 

తర్వాత కాంటాక్ట్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో 59 కేసులు నమోదయితే..అందులో ఒకరు కోలుకున్నారు. ఏపీలో 13 కేసులు నమోదయ్యాయి. వేలాది మంది ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. వీరికి 14 రోజుల పాటు చికిత్స అవసరం ఉంటుంది. ఇది ఇంకా వారం..పది రోజుల్లో ముగియనుంది. వీరిలో ఎంత మందికి వైరస్ ఇంకా ఉంది ? తదితర ప్రశ్నలు రాబోయే రోజుల్లో తేలనుంది.

వచ్చే కేసులను బట్టి వైరస్ వ్యాప్తి ఏ దశలో ఉందో ఒక క్లారిటీ రానుంది. ప్రస్తుతం ఈ సంఖ్య పెరుగుతుందా ? తగ్గుతుందా అనేది నిర్ధారణ కానుంది. కానీ ఖచ్చితంగా వైరస్ కేసులు తగ్గుతాయని, అది స్వీయ నిర్భందనం అయితేనే సాధ్యమౌతుందని నిపుణులు అంటున్నారు. ఇదొక్కటే వైరస్ కు విరుగుడు అని వెల్లడిస్తున్నారు. తెలంగాణాలో నమోదైన కేసులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే  నమోదు కావడం స్థానికంగా ఉన్న వారిని భయపెడుతోంది.

కానీ వైరస్ సోకిన వారికి ధైర్యం చేసి వైద్యులు చేస్తున్న కృషిని ఎంతో మంది అభినందిస్తున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది, ఇతర ఎంతో మంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కరోనా మహమ్మారి నుంచి రాష్ట్రం బయటపడాలని కోరుతున్నారు.