స్కూల్స్ సేఫేనా? ఒక్కరోజే 86మంది విద్యార్థులకు కరోనా, వైరస్ బారిన పడుతున్న విద్యార్థులు, ఆందోళనలో తల్లిదండ్రులు

తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లపై కరోనా పంజా విసురుతోంది. పాఠశాలల్లో కరోనావైరస్ కలకలం రేపుతోంది. స్కూల్స్ లో క్రమంగా కరోనావైరస్ వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకి స్కూళ్లలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వందల సంఖ్యలో విద్యార్థులు వైరస్ బారిన పడుతున్నారు.

10TV Telugu News

Coronavirus Tension In Schools : స్కూల్స్ సేఫేనా? ఒక్కరోజే 86మంది విద్యార్థులకు కరోనా, వైరస్ బారిన పడుతున్న విద్యార్థులు, ఆందోళనలో తల్లిదండ్రులు

coronavirus tension in schools : తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లపై కరోనా పంజా విసురుతోంది. పాఠశాలల్లో కరోనావైరస్ కలకలం రేపుతోంది. స్కూల్స్ లో క్రమంగా కరోనావైరస్ వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకి స్కూళ్లలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వందల సంఖ్యలో విద్యార్థులు వైరస్ బారిన పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే పలు స్కూళ్లకు చెందిన 86మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అసలు స్కూల్స్ సేఫేనా అనే ప్రశ్న తలెత్తింది. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల, మేడ్చల్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లోని స్కూల్స్ లో వైరస్ వ్యాప్తి చెందుతోంది.

* తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని రెండు ప్రభుత్వ పాఠశాలల్లో 28మంది విద్యార్థులకు పాజిటివ్ గా నిర్ధరణ అయ్యింది.
* రాజేంద్రనగర్ ఎస్టీ బాలుర వసతి గృహంలో 105మంది విద్యార్థులకు టెస్టులు చేస్తే 24మందికి కరోనా నిర్ధరణ అయ్యింది.
* దీంతో స్కూల్ రెండో అంతస్తులో వారందరిని ఐసోలేషన్ లో ఉంచారు అధికారులు.
* విద్యార్థులంతా రాజేంద్రనగర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. దీంతో ఆ స్కూల్ లో చదువుతున్న తోటి విద్యార్థులకు కూడా టెస్టులు చేయగా, మరో ఇద్దరు విద్యార్థులకు కోవిడ్ నిర్ధరణ అయ్యింది. వారిని హోంక్వారంటైన్ చేశారు.

* శంషాబాద్ మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. 8వ తరగతి విద్యార్థులు వైరస్ బారిన పడ్డారు.
* మేడ్చల్ జిల్లా నాగోల్ స్కూల్ లో హెడ్మాస్టర్ కు పాజిటివ్ రావడంతో టీచర్లు భయాందోళన చెందుతున్నారు. ప్రధాన ఉపాధ్యాయుడు మహారాష్ట్ర వెళ్లి రావడం, అనారోగ్యంతో ఉన్నా స్కూల్ కి రావడాన్ని టీచర్లు తప్పు పడుతున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 750మంది విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సి రావడం ఇబ్బందిగా మారిందంటున్నారు.

* నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో 176మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తే 25మందికి పాజిటివ్ ఉన్నట్టుగా తేలింది.
* మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 16మందికి కరోనా
* మంచిర్యాల బాలిక పాఠశాలలో 52మందికి కోవిడ్
* మేడ్చల్ జిల్లా నాగోల్ లోని మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూల్ లో 38కి కరోనా
* కామారెడ్డి జిల్లా కస్తూర్బా గాంధీ స్కూల్ లో 32మందికి కోవిడ్
* బాసర ట్రిపుల్ ఐటీలో ముగ్గురికి పాజిటివ్
* కాగజ్ నగర్ ఎస్టీ బాలికల హాస్టల్ లో 10మందికి కోవిడ్.
* ఆసిఫాబాద్ లో ఆరుగురు విద్యార్థులకు కరోనా సోకింది.
* భారీ సంఖ్యలో కరోనా పడిన టీచర్లు.
* ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో కరోనా కలకలం. 8 మంది టీచర్లకు కరోనా. మొన్న ఒక టీచర్ కు కరోనా పాజిటివ్ నిర్ధరణ కావడంతో స్కూల్ లోని టీచర్లు, సిబ్బంది, విద్యార్థులకు కరోనా పరీక్షలు చేశారు. అందులో ఏడుగురు టీచర్లకు పాజిటివ్ అని తేలింది. దీంతో స్కూల్ కు 5 రోజుల పాటు సెలవులు ప్రకటించారు అధికారులు.