నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు

నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఫలితాలు ఉత్కంఠగా మారాయి. ఊహించినట్టుగానే మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో.. రెండో ప్రాధాన్యత ఓట్లను ఎలిమినేషన్‌ పద్దతిలో లెక్కిస్తున్నారు.

నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు

Counting Of Second Priority Votes In Nalgonda Khammam Warangal Mlc Elections1

MLC elections votes Counting : నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఫలితాలు ఉత్కంఠగా మారాయి. ఊహించినట్టుగానే మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో.. రెండో ప్రాధాన్యత ఓట్లను ఎలిమినేషన్‌ పద్దతిలో లెక్కిస్తున్నారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు 24 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతోంది.

1 లక్షా 83 వేల 167 ఓట్లు గెలుపు కోటాగా నిర్ణయించారు అధికారులు. అయితే రెండో ప్రాధాన్యత ఓట్లలోనూ మ్యాజిక్‌ ఫిగర్‌ను అభ్యర్థులు చేరుకోకపోతే.. మెజార్టీ ఆధారంగా విజేతను ప్రకటిస్తామంటున్నారు. ఇక ఇప్పటివరకూ ఓట్లు తక్కువగా వచ్చిన 15 మంది అభ్యర్థులను ఎలిమినేట్‌ చేశారు. రేపు సాయంత్రానికి పూర్తి ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

రెండో ప్రాధాన్యతా ఓట్లపై మల్లన్న, కోదండరాం ఆశలు పెట్టుకున్నారు. మొదటి ప్రాధాన్యతా ఓట్లలో కోటా ఓట్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి సాధించలేకపోయారు. ఎలిమినేషన్ పద్ధతిలో రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ చెప్పారు.