Covaxin : కరోనా కట్టడిలో కోవాగ్జిన్ సూపర్ వ్యాక్సిన్

కరోనా కట్టడిలో దేశీయ వ్యాక్సిన్‌ మరో ముందడుగు వేసింది. కరోనా కట్టడిలో కోవాగ్జిన్‌ సూపర్‌ వ్యాక్సిన్‌ అని తేలింది. అన్ని రకాల కరోనా స్ట్రెయిన్‌లపైనా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ చెప్పింది.

Covaxin : కరోనా కట్టడిలో కోవాగ్జిన్ సూపర్ వ్యాక్సిన్

Covaxin

Covaxin : కరోనా కట్టడిలో దేశీయ వ్యాక్సిన్‌ మరో ముందడుగు వేసింది. కరోనా కట్టడిలో కోవాగ్జిన్‌ సూపర్‌ వ్యాక్సిన్‌ అని తేలింది. అన్ని రకాల కరోనా స్ట్రెయిన్‌లపైనా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ చెప్పింది. ఇండియా, బ్రిటన్‌లో వ్యాపించిన వివిధ కోవిడ్ వేరియంట్లను తమ కోవాగ్జిన్ వ్యాక్సిన్ సమర్థంగా అదుపు చేయగలిగిందని భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది.

వైరస్‌ను సమర్థవంతంగా అదుపు చేయడంతో.. భారత్‌ బయోటెక్‌ సంస్థ తయారు చేసిన కోవాగ్జిన్‌ టీకా.. బెస్ట్‌ అని తేలింది. అన్ని రకాల కరోనా వేరియంట్లపై తమ వ్యాక్సిన్‌ ప్రభావంతంగా పనిచేస్తోందంటోంది ఆ సంస్థ. భారత్‌లో బీ 1.617, బ్రిటన్‌లో బీ 1.1.7 వేరియంట్లను మొదట గుర్తించామని.. వీటితో బాటు ఇతర వేరియంట్లపై కూడా సమర్థవంతంగా పనిచేస్తోందని ప్రకటించింది భారత్‌ బయోటెక్‌.

భారత్‌, బ్రిటన్‌ వేరియంట్లపై వ్యాక్సిన్‌తో టెస్ట్ చేసినప్పుడు వీటిని న్యూట్రలైజ్ చేయగలగడంలో.. కోవాగ్జిన్‌ మెరుగైన ఫలితాలు కనబరిచిందని వెల్లడించింది భారత్‌ బయోటెక్‌. వ్యాక్సిన్ వేరియంట్ D614Gతో పోల్చినప్పుడు B 1.617 శక్తి 1.95 వరకు తగ్గినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇది కొంతమేర తగ్గినప్పటికీ B 1.617 వేరియంట్ కాన్‌సంట్రేషన్‌ లెవెల్స్ అనుకున్న లెవెల్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అది సులభంగా న్యూట్రలైజ్ కాగలిగిందనే విషయం ప్రయోగాల్లో తేలిందని చెప్పింది.

మొదట యూకేలో కనుగొన్న B 1.1.7 వేరియంట్‌కి, ఆ తరువాత వ్యాక్సిన్ స్ట్రెయిన్ D614G కి మధ్య న్యూట్రలైజేషన్‌లో తేడా కనబడిందన్నారు. జాతీయ వైరాలజీ సంస్థ, ఐసీఎంఆర్‌ సంయుక్తంగా చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్లు భారత్‌ బయోటెక్‌ తెలిపింది. తమ టీకా సామర్థ్యంపై భారత్​బయోటెక్​ కో-ఫౌండర్ ​సుచిత్ర ఎల్ల ట్వీట్​చేశారు. క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనే మెడికల్ జర్నల్‌లో తమ అధ్యయనాన్ని ట్వీట్‌లో పోస్ట్ చేశారు.

కొత్త రకం స్ట్రెయిన్ల నుంచి.. కోవాగ్జిన్‌ రక్షణ కల్పిస్తుందని సైంటిఫిక్ రీసెర్చ్ డేటా పబ్లిష్ కావడం వల్ల కొవాగ్జిన్​ మరోసారి అంతర్జాతీయ గుర్తింపు పొందిందని.. భారత్​ బయోటెక్ ​కిరీటంలో ఇది మలో కలికీతురాయి అని సుచిత్ర ఎల్ల ట్వీట్ చేశారు. ట్వీట్‌లో ప్రధాని కార్యాలయంతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌లను ట్యాగ్​ చేశారు.

ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న మూడు వ్యాక్సిన్లలో కోవాగ్జిన్ ఒకటి. కరోనా కట్టడి కోసం ఐసీఎంఆర్‌తో కలిసి హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేసింది.