హైదరాబాద్‌ లో డ్రగ్స్‌ కలకలం, చదువుకోవడానికి వచ్చి డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్

10TV Telugu News

drugs sieze in hyderabad : హైదరాబాద్‌ వెస్ట్‌ జోన్‌ పరిధిలో డ్రగ్స్‌ కలకలం రేగింది. సిటీ యూత్‌ను టార్గెట్‌ చేస్తూ డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న నైజీరియన్‌ను అదుపులోకి తీసుకున్నారు వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.
స్టూడెంట్‌ వీసా మీద హైదరాబాద్‌కు వచ్చి చదువుకుంటున్న డానియల్‌.. ఇక్కడి స్టూడెంట్స్‌కు డ్రగ్స్‌ అలవాటు చేస్తున్నట్లు గుర్తించారు. లంగర్‌హౌజ్‌లో డ్రగ్స్‌ సరఫరా చేస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి 6 గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.