Gaddar-KA PAUL Munugode Bypoll : రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారిన గద్దర్, కేఏ పాల్ దోస్తీ ..

రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది ప్రజాగాయకుడు గద్దర్, ఖేఏ పాల్ దోస్తీ. ప్రజాశాంతి పార్టీ నుంచి మునుగోడు ఎన్నిక బరిలో ఉంటానని గద్దర్ ప్రకటించటంతో రాజకీయా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Gaddar-KA PAUL Munugode Bypoll : రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారిన గద్దర్, కేఏ పాల్ దోస్తీ ..

Gaddar-KA PAUL Munugode Bypoll

Gaddar-KA PAUL Munugode Bypoll  : ఆ ఇద్దరివి పూర్తి భిన్నదృవాలు .. ఒకరు శాంతిదూత. మరొకరు విప్లవ గాయకుడు. వారి మాటా..పాట..ఆలోచనలు అన్నీ భిన్నం.కానీ వారిద్దరు కలిసి ప్రయాణించాలనుకున్నారు. తన జీవితం అంతాపాటకే అంకితం అని ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని అన్న ఆయన రూటు మార్చారు. ఆయా రాజకీయా పార్టీలు ఎన్ని పదవులు ఆఫర్ చేసినా తిరస్కరించిన ఆ ప్రజా యుద్ధనౌక శాంతి దూతతో జతకట్టారు. అలా భిన్నదృవాలైనవారిద్దరు అందర్ని ఆశ్చర్యపరిచారు. వారే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. మరొకరు ప్రజా గాయకుడు గద్దర్.

ప్రజా గాయకుడు గద్దర్.. ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు… మరొకరు ప్రపంచ శాంతి దూత కేఏ పాల్. ఈయన జనమందరికి సుపరిచితులే.. ఆ ఇద్దరు కలిసి ఒకే నౌకలో ప్రయాణం చేయబోతున్నారు.. తెలంగాణ ఉద్యమం కోసం కాలికి గజ్జె కట్టి.. నేను పాటనై వస్తున్న అంటూ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా తన పాటతో హోరెత్తించారు గద్దర్.. నక్సలైట్ ఉద్యమం దగ్గర నుంచి తెలంగాణ ఉద్యమం వరకు గద్దర్ ప్రస్థానం మొత్తం పాటతోనే సాగింది. ఏ పార్టీకి సంబంధం లేకుండా తనదైన శైలిలో తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు గద్దర్..

Also read : Gaddar Contest Munugode Bypoll : గద్దర్ సంచలన నిర్ణయం.. మునుగోడులో ఎవరూ ఊహించని పార్టీ అభ్యర్థిగా పోటీ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గద్దర్ ఉనికి కనుమరుగైంది. తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొననని… అయితే ఓటు హక్కు విలువ కోసం ప్రచారం చేస్తానంటూ అప్పట్లో ప్రకటించారు గద్దర్. ఆ తర్వాత తెలంగాణలోని రాజకీయ పార్టీలు తమ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించాయి. కానీ ఆయన ససేమిరా అన్నారు. అయితే విప్లవ గీతాలు ఆలపించిన గద్దర్ కొంతకాలంగా శాంతి జపం ఆలపిస్తున్నారు. ఉన్నట్లుండి ప్రపంచ శాంతి దూత కేఏ పాల్‌తో చెట్టాపట్టాలేసుకొని, శాంతి దూత అవతారం ఎత్తారు. తాజాగా కేఏ పాల్ స్థాపించిన ప్రజాశాంతి పార్టీలో చేరడం.. ఆ వెంటనే మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పక్షాన బరిలో ఉంటానంటూ గద్దర్‌ ప్రకటించడం సంచలనంగా మారింది.

భారత రాజ్యాంగాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయాలంటే తనకు కేఏ పాల్‌ లాంటి వ్యక్తి సహకారం కావాలని ప్రకటించారు గద్దర్‌. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.. పాస్‌పోర్ట్ కూడా లేని వ్యక్తి ప్రపంచ దేశాల్లో తిరుగుతూ భారత రాజ్యాంగ యొక్క ప్రాముఖ్యతను చెప్పడం కొంత ఖర్చుతో కష్టంతో కూడుకున్న పనే. ఇప్పటికే ప్రజా గాయకుడు గద్దర్‌పై పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో దేశం దాటి వెళ్లడం కష్టతరం. తనకు కేసుల నుంచి విముక్తి కల్పించాలంటూ ప్రధాని దగ్గర నుంచి కేంద్ర మంత్రుల వరకు సందర్భం వచ్చినప్పుడల్లా ప్రాధేయ పడుతున్నారు గద్దర్. తాను తుది శ్వాస విడిచే నాటికైనా తన మీద కేసులను రద్దు చేయాలని గద్దర్ ఎప్పటినుంచో కోరుతున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ప్రపంచ శాంతి దూత కేఏ పాల్‌తో గద్దర్‌ తాజాగా దోస్తీ చేయడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. భిన్న ధృవాలుగా ఉన్న ఈ ఇద్దరూ కలిసి రాబోయే రోజుల్లో ఎలా ప్రయాణం చేస్తారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. వీరిద్దరి జర్నీ ఏ గమ్యానికి చేరవేస్తుందో.. లేదో కాలమే నిర్ణయించాలి.