TSRTC : ఆర్టీసీ కార్మికులకు గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి చెల్లింపు

పెండింగ్ బకాయిలతో పాటు డీఏ అరియర్స్ కూడా చెల్లిస్తే కార్మిక కుటుంబాలకు ఉపయోగంగా ఉంటుంది. TSRTC - DA

TSRTC : ఆర్టీసీ కార్మికులకు గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి చెల్లింపు

TSRTC - DA (Photo : Google)

TSRTC – DA : ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (టీఎస్ఆర్టీసీ). మరో డీఏ (కరవు భత్యం) ఇవ్వాలని నిర్ణయించింది. సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి డీఏని చెల్లింపు చేయనుంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సిన 5శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేసింది. సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు చెల్లింపు చేయనుంది. ఇప్పటివరకు 8 డీఏలను సంస్థ మంజూరు చేసినట్లు టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారని.. పెండింగ్‌ బకాయిలను త్వరలోనే ఇవ్వడానికి యాజమాన్యం ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు.

Also Read..Korutla Deepthi Case : కోరుట్ల దీప్తి కేసు.. 70తులాల బంగారం తీసుకుని ప్రియుడితో పారిపోయేందుకు చందన మాస్టర్ ప్లాన్, చివరి నిమిషంలో ఊహించని దారుణం

మరో విడత డీఏ చెల్లించాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయం పట్ల టీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలు స్పందించాయి. ”పెండింగ్ డీఏ విడుదలను స్వాగతిస్తున్నాము. ప్రస్తుత చెల్లింపు డీఏతో మొత్తం 8 డీఏలు యాజమాన్యం చెల్లించింది. పెండింగ్ డీఏ చెల్లింపుతో పాటు 169 నెలల డీఏ అరియర్స్ చెల్లించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ విలీన ప్రక్రియ జరుగుతోంది. కాబట్టి పెండింగ్ బకాయిలతో పాటు డీఏ అరియర్స్ కూడా చెల్లిస్తే కార్మిక కుటుంబాలకు ఉపయోగంగా ఉంటుంది” అని ఆర్టీసీ కార్మిక సంఘాలు చెప్పాయి.