Heavy Rains : తెలంగాణలో దంచికొడుతున్న వానలు

పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి గనుల్లో .. భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఇక్కడున్న మూడు రీజియన్‌లలో నాలుగు ఓపెన్‌కాస్ట్‌ గనులున్నాయి. ఇక్కడ ప్రతిరోజూ మూడు షిఫ్టుల్లో 70వేల టన్నుల ఉత్పత్తి అవుతోంది.

Heavy Rains : తెలంగాణలో దంచికొడుతున్న వానలు

Rain

Heavy rains : అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో వర్షం కుండపోతగా కురుస్తోంది. ఆకాశానికి చిల్లుపడినట్లు ఏకథాటిగా భారీ వర్షం పడుతూనే ఉంది. గత 24 గంటల్లో అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కాళేశ్వరం, శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మరికొన్ని రోజులు ఇదే స్థాయిలో వర్షాలు కురిస్తే ప్రాజెక్టుల్లో నీటి మట్టం గరిష్టస్థాయికి చేరుకునే అవకాశముంది.

నిజామాబాద్‌ జిల్లాలో భారీ వర్షం కుమ్మేస్తోంది. ఎడతెరిపిలేని వర్షాలకు బోధన్‌ నియోజకరవ్గంలోని రెంజల్‌ మండలం కందకుర్తి త్రివేణి సంగమం దగ్గర.. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గ్రామాల్లో చెరువులు అలుగు పారుతున్నాయి. నవీపేట మండలంలో కాలువకు గండి పడటంతో .. జాన్నేపల్లి నుంచి నలేశ్వర్‌ వరకు పంటపొలాలు చెరువులను తలపిస్తున్నాయి.

Telangana Holidays : భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు మూడు రోజులపాటు సెలవులు

కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని హరిజనవాడలో భారీ వర్షాలతో .. రేకుల ఇల్లు కూలిపోయింది. అందులో నివాసం ఉంటున్న శివ కుటుంబ సభ్యులు ముగ్గురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పురపాలక సంఘం ఛైర్మన్‌ గంగాధర్‌.. ఘటనా స్థలానికి వచ్చి బాధితులను పరామర్శించారు. వర్షాలతో ఇళ్లలోకి నీరు చేరడంతో .. స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

ఖమ్మం జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు సత్తుపల్లి మండలం కిష్టాపురం-చెరుకుపల్లి, కిష్టాపురం-జగన్నాధపురం గ్రామాల మధ్య .. చౌటువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగుకు వరద ఎక్కువ కావడంతో .. అక్కడున్న కాలువల నుంచి నీరు పొంగి పొర్లుతోంది. దీంతో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వరద ప్రవాహాన్ని అధికార బృందంతో కలిసి పరిశీలించారు.

Rain Warning : తెలంగాణ జిల్లాలకు రెయిన్‌ వార్నింగ్‌..భారీ నుంచి అతి భారీ వర్షాలు

పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి గనుల్లో .. భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఇక్కడున్న మూడు రీజియన్‌లలో నాలుగు ఓపెన్‌కాస్ట్‌ గనులున్నాయి. ఇక్కడ ప్రతిరోజూ మూడు షిఫ్టుల్లో 70వేల టన్నుల ఉత్పత్తి అవుతోంది. అయితే వర్షాలతో 2లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. వర్షం నీరు చేరడంతో.. భారీ యంత్రాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. బొగ్గు రవాణాకు ఆటంకం ఏర్పడింది. దీంతో దాదాపు రెండు కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. వర్షం తగ్గితేనే ఉత్పత్తి సాగుతోందని అధికారులు చెబుతున్నారు.

నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొత్తగూడెంలో ఓపెన్ కాస్ట్ గునుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద నీరు చేరడంతో బొగ్గు వెలికితీత నిలిచిపోయింది. అండర్ గ్రౌండ్ మైన్స్‌లోకి వెళ్లే కార్మికులు వర్షంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గనుల నుంచి బయటకు వచ్చే రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. దీంతో వాహనాలు తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. మోటార్లతో నీటిని బయటకు తోడుతున్నా.. వర్షాలకు మళ్లీ చేరుతోంది. ఇప్పటి వరకు కొత్తగూడెంలో 27 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.