Rain Warning : తెలంగాణ జిల్లాలకు రెయిన్‌ వార్నింగ్‌..భారీ నుంచి అతి భారీ వర్షాలు

హైదరాబాద్‌ వాతావరణం కేంద్రం హెచ్చరించినట్లుగానే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోతోంది.

Rain Warning : తెలంగాణ జిల్లాలకు రెయిన్‌ వార్నింగ్‌..భారీ నుంచి అతి భారీ వర్షాలు

Rain Warning

rain warning : తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ రెయిన్‌ వార్నింగ్‌ ఇచ్చింది. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని 8 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమురం భీమ్‌, మంచిర్యాల, నిర్మల్‌.. నిజామాబాద్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే చాన్స్‌ ఉందని తెలిపారు.

హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ద్రోణి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో.. ప్రజలు అప్రమ్తతంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు.. నిర్మల్‌ జిల్లాలోని భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తింది. దీంతో.. గేట్లు ఎత్తడంతో భైంసా టౌన్‌లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.

Heavy Rains : నిర్మల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు..నీట మునిగిన పలు ప్రాంతాలు

హైదరాబాద్‌ వాతావరణం కేంద్రం హెచ్చరించినట్లుగానే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోతోంది. 14 జిల్లాలకు రెడ్‌ అలర్ట్ జారీ చేయడంతో ఆయా జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్‌లో రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు.. పెనుబల్లి మండలంలో లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వి.ఎం బంజర్‌లో రహదారులపై వర్షపు నీరు పోటెత్తింది. పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. లంకసాగర్‌ ప్రాజెక్టు, సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి పెద్ద చెరువుకు వరద నీరు పోటెత్తింది.