Heavy Rains : నిర్మల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు..నీట మునిగిన పలు ప్రాంతాలు

గేట్లు ఎత్తడంతో భైంసా టౌన్ లోని పలు ప్రాంతాలు నీటి మునిగాయి. ఆటో నగర్, వివేకానంద చౌక్, పద్మావతి కాలనీ, ఎన్ఆర్ గార్డెన్ నీటి మునిగాయి. ఎన్ ఆర్ గార్డెన్ లో ఆరుగురు సిబ్బంది చిక్కున్నారు.

Heavy Rains : నిర్మల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు..నీట మునిగిన పలు ప్రాంతాలు

Nirmal

Heavy rains : తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. జిల్లాలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. బైంసా గడ్డెన్న వాడు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి 50 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు.

గేట్లు ఎత్తడంతో భైంసా టౌన్ లోని పలు ప్రాంతాలు నీటి మునిగాయి. ఆటో నగర్, వివేకానంద చౌక్, పద్మావతి కాలనీ, ఎన్ఆర్ గార్డెన్ నీటి మునిగాయి. ఎన్ ఆర్ గార్డెన్ లో ఆరుగురు సిబ్బంది చిక్కున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Heavy Rains In Telangana : తెలంగాణాలో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్-అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు సహా సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించాలని, వరద ముంపు ప్రాంతాలల్లోని అధికారులను, ఎన్డీఆర్ ఎఫ్, రెస్క్యూ టీం లను అప్రమత్తం చేయాలని తెలిపారు.

మహారాష్ట్రతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ వున్ననేపథ్యంలో తాను పరిస్థితులను ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూంటానని పరిస్థితులనుబట్టి నేడో, రేపో వీడియో కాన్ఫరెన్సు కూడా నిర్వహిస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు. జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నాయకులు, ప్రజాప్రతినిధులు తమ తమ ప్రాంతాల ప్రజల రక్షణ నిమిత్తం అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

Heavy Rains : హైద‌రాబాద్ లో రాబోయే మూడు రోజులు అతి భారీ వర్షాలు..రెడ్ అల‌ర్ట్‌ జారీ

రక్షణ చర్యల్లో ప్రజలకు సాయపడుతూ,, నష్టాలను జరగకుండా చూసుకోవలని ప్రజా ప్రతినిధులకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అనవసరంగా ప్రజలు రిస్కు తీసుకోవద్దన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకుండా ఉండాలని, తగు స్వీయ జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సీఎం కేసీఆర్ విజ్జప్తి చేశారు.