Heavy Rains In Telangana : తెలంగాణాలో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్-అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు.

Heavy Rains In Telangana : తెలంగాణాలో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్-అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు

Telangana Rains

Heavy Rains In Telangana : రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఆవర్తనం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర ప్రాంత తీరాలకు ఆనుకొని ఉన్న వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరంలో సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించింది. ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వంపు తిరిగి స్థిరంగా కొనసాగుతున్నదని ఆమె వెల్లడించారు.

ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుండి అతిబరీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్ నగరంలో ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసాయి. రామంతాపూర్ లో అత్యధికంగా 7.5 సెంటీమీటర్ల వర్షం నమోదు అయింది. మాదాపూర్, కొండాపూర్,హఫీజ్ పెట్, దబిర్పురాలలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.

చార్మినార్, బండ్లగూడ, సీతాఫల్ మండి, జూబ్లీహిల్స్, శ్రీనగర్ కాలనీ,నాంపల్లి, నారాయణగూడ, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, రామచంద్రపురం, ప్రాంతాల్లో ఐదు సెంటీమీటర్ల వర్షపాతం….ముషీరాబాద్, ఆసిఫ్ నగర్, బతుకమ్మ కుంట, మొండా మార్కెట్, హబ్సిగూడ, కురుమ గూడ, బన్సీలాల్ పేట్, బోరబండ, అంబర్ పేట, అమీర్ పేట ప్రాంతాల్లో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.

హైదరాబాద్ కు ఈరోజు ఆరెంజ్ అలర్టును జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్ లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు సూచించారు. మరో వైపు రాష్ట్రంలోని 9 జిల్లాలకు రెడ్ ఎలర్ట్ జారీ చేసింది. శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

ఆదిలాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశం ఉన్నదని వెల్లడించింది. శుక్రవారం రాత్రి ప్రారంభమైన వర్షాలు కొన్ని జిల్లాలలో శనివారం ఉదయం కూడా కురుస్తూనే ఉన్నాయి.

Also Read : Rains Lashes Hyderabad : హైదరాబాద్‌లో భారీ వర్షం.. తెలంగాణకు రెడ్, హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్