Karmanghat : నిందితులను అరెస్టు చేయాలి, గోరక్షక్ సభ్యులపై కేసులను ఎత్తివేయాలి

గోవులను తరలిస్తున్న వాహనాలను గో రక్షక్ దళ్ సభ్యులు అడ్డుకున్నారని, అడ్డుకున్న సభ్యులపై దుండగులు దాడి చేసినట్లు చెప్పారు. దాడి చేస్తున్న సమయంలో గుళ్లోకి వెళితే.. అక్కడా తల్వార్ లతో

Karmanghat : నిందితులను అరెస్టు చేయాలి, గోరక్షక్ సభ్యులపై కేసులను ఎత్తివేయాలి

Goraksha

High Tension In Karmanghat : హైదరాబాద్ లోని కర్మన్ ఘాట్ లో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. 2022, ఫిబ్రవరి 23వ తేదీ బుధవారం ఉదయం నుంచి అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. గోరక్షకులపై గుర్తు తెలియని దుండుగులు కత్తులతో స్వైర విహారం చేయడమే ఇందుకు కారణం. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ బీజేపీ నేతలు, గోరక్షక్ కార్యకర్తలు, బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు ప్రముఖంగా పేరొందిన కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. దీనిపై విశ్వహిందు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు స్పందించారు.

Read More : Cow Saviors: పోలీసుల వలయంలో కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్

గోరక్షక్ దళ్ సభ్యులపై కేసులా :-
ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు తెలియచేశారు. గోవులను తరలిస్తున్న వాహనాలను గో రక్షక్ దళ్ సభ్యులు అడ్డుకున్నారని, అడ్డుకున్న సభ్యులపై దుండగులు దాడి చేసినట్లు చెప్పారు. దాడి చేస్తున్న సమయంలో గుళ్లోకి వెళితే.. అక్కడా తల్వార్ లతో వచ్చారన్నారు. గో రక్షక్ దళ్ సభ్యులపై పోలీసులు 307 సెక్షన్ పెట్టడం దారుణమని, వెంటనే నిందితులను అరెస్ట్ చేసి గో రక్షక్ దళ్ సభ్యులపై నమోదైన కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. 30 మంది తల్వార్ లతో దేవాలయంలోకి ప్రవేశించడంపై డీజీపీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో సైతం విశ్వ హిందు పరిషత్ తరపున తాము నిరసన చేపట్టడం జరిగిందన్నారు. చట్టాలను అమలు చేయడంలో, గోవులను రక్షించడంలో పోలీసులు విఫలం చెందుతున్నారని విమర్శించారు. గోవులను రక్షించేందుకు గ్రామ గ్రామాన పోరాటం చేయడం జరుగుతుందని, గో రక్ష చట్టాలను వెంటనే అమలు చేయాలని రామరాజు డిమాండ్ చేశారు.

Read More : Hyderabad : గోవులను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్న గో రక్షక్ సభ్యులు.. కత్తులతో దాడి చేసిన దుండగులు

అసలు ఏం జరిగింది :-
కర్మన్ ఘాట్ లో గోవులను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని గో రక్షక్ సభ్యులు అడ్డుకున్నారు. ఆ వాహనాన్ని వెనుక నుండి మరో వాహనం ఢీకొట్టింది. దుండగులు కత్తులతో దాడి చేసి వాహనాన్ని ధ్వంసం చేశారు. గో రక్షక్ సభ్యులు భయంతో పరుగులు తీసి సమీపంలో ఉన్న హనుమాన్ టెంపుల్ లోకి పరుగులు తీశారు. టెంపుల్ లోకి తల్వార్ లతో వచ్చిన దండుగులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో గో రక్షక్ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ విషయం దావానంలా వ్యాపించింది. ఆంజనేయ స్వామి దేవాలయానికి హిందూ సంఘాలు చేరుకున్నాయి. దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేయాలంటూ నిరసనకు దిగారు. మహేశ్వరం నియోజకవర్గ ఇన్ ఛార్జీ, బీజేపీ నేత అందెల శ్రీరాములు యాదవ్ హుటా హుటినా ఘటననా స్థలానికి చేరుకున్నారు.

Read More : Telangana Corona Cases : తెలంగాణలో కొత్తగా 374 కరోనా కేసులు

కేసు నమోదు :-
బీజీపీ నేతలు కూడా రావడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రోడ్డుపై భైఠాయించి ఆందోళన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన చేపడుతున్న వారిని అరెస్టు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కర్మన్ ఘాట్ పరిసర ప్రాంతాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. బీజేపీ నాయకులను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మీర్ పెట్ పోలీస్ స్టేషన్ లో దుండగుల పై గో రక్షక్ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.