Telangana Corona Cases : తెలంగాణలో కొత్తగా 374 కరోనా కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 39వేల 579 కరోనా పరీక్షలు చేయగా, 374 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 91 కొత్త కేసులు వచ్చాయి.

Telangana Corona Cases : తెలంగాణలో కొత్తగా 374 కరోనా కేసులు

Telangana Corona Cases

Telangana Corona Cases : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 39వేల 579 కరోనా పరీక్షలు చేయగా, 374 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 91 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 39, నల్గొండ జిల్లాలో 22 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో మరొకరు కరోనాతో మరణించారు.

మరో 683 కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,87,437 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,78,850 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 4వేల 477 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,110కి పెరిగింది. క్రితం రోజుతో(385) పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి.

Corona Virus: కరోనా ముగిసింది.. ఐటీ ఉద్యోగులకూ “వర్క్ ఫ్రమ్ హోమ్” అవసరం లేదు

భారత్ ను భయాందోళనకు గురి చేసిన కరోనా మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తోంది. కొన్ని రోజులుగా కొత్త కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా మూడోరోజు 20 వేల దిగువనే కేసులు నమోదయ్యాయి. తాజాగా 13 వేలకు తగ్గాయి. పాజిటివిటీ రేటు 1.24 శాతానికి
క్షీణించింది. మృతుల సంఖ్య కూడా అదుపులోనే ఉంది.

సోమవారం 10,84,247 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13వేల 405 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ముందురోజు కంటే కేసులు 16 శాతం మేర తగ్గాయి. ఇప్పటివరకూ 4.28 కోట్ల మందికి కరోనా సోకింది. ఇక 24 గంటల వ్యవధిలో మరో 235 మంది కోవిడ్ తో ప్రాణాలు
కోల్పోయారు. ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 5,12,344కి పెరిగింది.

Telangana : కరోనా వ్యాక్సినేషన్..దేశంలోనే తెలంగాణ టాప్

కరోనా వ్యాప్తి అదుపులో ఉండటంతో యాక్టివ్ కేసులు 2 లక్షల దిగువకు చేరాయి. ప్రస్తుతం ఆ కేసులు 1,81,075గా ఉండగా.. క్రియాశీల రేటు 0.42 శాతానికి తగ్గింది. నిన్న 34,226 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 4.21 కోట్ల(98.38 శాతం)కు పైనే. ఇక నిన్న 35,50,868 మంది టీకా తీసుకున్నారు. ఇప్పటివరకూ 175 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు తెలిపింది.