BJP: మా రాష్ట్రంలో ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తాం.. తెలంగాణలో మాత్రం: అసోం సీఎం హిమంత

కరీంనగర్ లో బీజేపీ హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తోంది.

BJP: మా రాష్ట్రంలో ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తాం.. తెలంగాణలో మాత్రం: అసోం సీఎం హిమంత

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma: అసోంలో ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. తెలంగాణలో మాత్రం వేతనాలు ఎప్పుడు ఇస్తారో ఎవరికీ తెలియట్లేదని చెప్పారు. కరీంనగర్ లో (Karimnagar) బీజేపీ హిందూ ఏక్తా యాత్ర (Hindu Ekta Yatra Rally) నిర్వహిస్తోంది.

భారీ సంఖ్యలో స్థానికులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్, తదితర నేతలు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హిమంత బిశ్వ శర్మ అతిథిగా వచ్చి, పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఏక్తా యాత్ర హిందువులను ఏకం చేస్తుందని హిమంత బిశ్వ శర్మ చెప్పారు. తెలంగాణలో రామరాజ్యం వస్తుందని తెలిపారు. త్వరలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని అన్నారు. ఇప్పటికే జమ్మూకశ్మీర్ లో కేంద్ర సర్కారు 370 ఆర్టికల్ ను రద్దు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో రజాకార్ల రాజ్యం నడుస్తోందని విమర్శించారు.

బీఆర్ఎస్-ఎంఐఎం ఒక్కటేనని చెప్పారు. తాము అసోంలో దాదాపు ఆరు వేల మదర్సాలను మూయించి వేశామని హిమంత బిశ్వ శర్మ తెలిపారు. తెలంగాణలో ధరలు పెరిగిపోతున్నాయని, పెట్రోల్, డీజిల్ ధరలు ఇంత అధికంగా ఎందుకున్నాయని హిమంత బిశ్వ శర్మ నిలదీశారు. తెలంగాణ తాము అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేరు ఢిల్లీలో బాగా వినపడుతోందని, ఎందుకంటే ఆ పార్టీ నేతలు లిక్కర్ దందా చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

Karnataka: సీఎం అవుతారన్న ఊహాగానాల మధ్య.. మఠంలో స్వామీజీని దర్శించుకున్న డీకే శివకుమార్