Huzurabad By Poll : హుజూరాబాద్ ఎన్నికలు..12 మంది అవుట్

నామినేషన్ల ఉపసంహరణ ముగిసిపోయింది. పోటీ నుంచి 12 మంది అవుట్ అయిపోయారు. దీంతో బరిలో 30 మంది ఉన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలవాలని ప్రధాన ప్రతిపక్షాలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి

Huzurabad By Poll : హుజూరాబాద్ ఎన్నికలు..12 మంది అవుట్

Huzurabad 2021

Huzurabad By Election Nominations : హుజూరాబాద్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే చాలా మంది నామినేషన్లు దాఖలు చేశారు. 2021, అక్టోబర్ 13వ తేదీ బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ ముగిసిపోయింది. దీంతో ఎంత మంది బరిలో ఉన్నారనే సంగతి తేలిపోయింది. పోటీ నుంచి 12 మంది అవుట్ అయిపోయారు. దీంతో బరిలో 30 మంది ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి జమున నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు.

Read More : Extra Marital Affair : బీజేపీ కార్పోరేటర్ భర్త వివాహేతర సంబంధం.. చెప్పుతో కొట్టిన తల్లి

అలాగే…కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఒంటెల లింగారెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్తులు సుమన్ నాయక్, వినోద్ కుమార్, రాజ్ కుమార్, నూర్జహాన్ బేగం, మల్లికార్జున్ తదితరులు నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. రిటర్నింగ్ కార్యాలయంలో పలువురు ఇండిపెండెంట్లు వేచి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బరిలో ఉండే వారి సంఖ్య ఇంకా తగ్గిపోవచ్చు. తర్వాతే..హుజూరాబాద్ ఆర్డీవో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అభ్యర్థుల ఆధారంగా…ఈవీఎంలు ఉండనున్నాయి. ఈవీఎంలో 15 మంది అభ్యర్థులు, నోటా కలిపి 16 మందికి అవకాశం ఉంది. ఇండిపెంట్ల అభ్యర్థుల పేర్లతో అక్షర క్రమంలో సింబల్స్ కేటాయించనున్నారు.

Read More : Kerala Uthra Murder Case : భార్యను పాముతో చంపించిన భర్తకు రెండు శిక్షలు విధించిన కోర్టు

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలవాలని ప్రధాన ప్రతిపక్షాలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ గెలుపు అస్త్రాన్ని సంధించేందుకు .. ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు పాట్లు పడుతున్నారు అభ్యర్థులు. ప్రధాన పోటీ టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యనే ఉన్నా..  కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇవ్వాలని యత్నిస్తోంది. గెలుపు కోసం పార్టీలు తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నాయి.