Extra Marital Affair : బీజేపీ కార్పోరేటర్ భర్త వివాహేతర సంబంధం.. చెప్పుతో కొట్టిన తల్లి

నిజామాబాద్ కు చెందిన బీజేపీ కార్పోరేటర్ భర్త ఓయువతితో వివాహేతర సంబధం పెట్టుకున్నాడు. తమ కూతురుని కిడ్నాప్ చేశాడని ఆరోపిస్తూ ఆమె తల్లి తండ్రులు బుధవారం కార్పోరేటర్ ఇంటి వద్ద ఆందోళనక

Extra Marital Affair : బీజేపీ కార్పోరేటర్ భర్త వివాహేతర సంబంధం.. చెప్పుతో కొట్టిన తల్లి

Bjp Corporator Husband Illegal Affair

Updated On : October 13, 2021 / 3:48 PM IST

Extra Marital Affair :  నిజామాబాద్ కు చెందిన బీజేపీ కార్పోరేటర్ భర్త ఓయువతితో వివాహేతర సంబధం పెట్టుకున్నాడు. తమ కూతురుని కిడ్నాప్ చేశాడని ఆరోపిస్తూ ఆమె తల్లి తండ్రులు బుధవారం కార్పోరేటర్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. నిజామాబాద్ కు చెందిన బీజేపీ కార్పోరేటర్ భర్త అయిన ఆకుల శ్రీను డాక్టర్ గా పనిచేస్తున్న యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

మంగళవారం రాత్రి తమ కూతురుకు మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేసి తీసుకువచ్చాడని ఆమె తల్లి తండ్రులు ఆరోపిస్తున్నారు. కిడ్నాప్ చేసిన తమ కుమార్తెను అప్ప చెప్పాలని ఈరోజు ఉదయం వినాయక నగర్ లోని కార్పోరేటర్ ఇంటికి వచ్చి ఆందోళన చేశారు.

Also Read : Kerala Uthra Murder Case : భార్యను పాముతో చంపించిన భర్తకు రెండు శిక్షలు విధించిన కోర్టు
బాధితురాలి తల్లి …కార్పోరేటర్ ఇంటిలోకి వెళ్లి ఆమె భర్తను చెప్పుతో కొట్టింది. తమ కూతురును తమకు అప్పగించాలని ఆమె తల్లితండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో మందలించినా ఆకుల శ్రీను పద్దతి మార్చుకోలేదని వారు వాపోయారు.