Telangana cancer cases : తెలంగాణలో 30 ఏళ్లలో 50 శాతం పెరిగిన క్యాన్సర్ కేసులు..

తెలంగాణలో 30 ఏళ్లలో 50 శాతం పెరిగిన క్యాన్సర్ కేసులు పెరిగాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Telangana cancer cases : తెలంగాణలో 30 ఏళ్లలో 50 శాతం పెరిగిన క్యాన్సర్ కేసులు..

Rising Cancer Cases In Telangana

Rising cancer cases in Telangana : తెలంగాణపై క్యాన్సర్‌ పంజా విసురుతోంది. ప్రతీ ఏటా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఎంతగా పెరుగుతోందంటే గత 30 ఏళ్లలో 50 శాతం క్యాన్సర్ కేసులు పెరిగాయని నిపుణులు హెచ్చరించారు.  పట్టణ జనాభాలో రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తులు, గర్భాశయం,అన్నవాహిక క్యాన్సర్లు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరించారు. 1990లో ఉమ్మడి ఏపీలో ఒక లక్షమంది జనాభాకు 54 క్యాన్సర్ రోగులు ఉన్నారని కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి లక్ష జనాభాకు 75మంది క్యాన్సర్ రోగులున్నాయని తెలిపారు.ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2025 నాటికి 12 శాతం మేర కేసులు పెరిగే ప్రమాదం ఉందని ఐసీఎంఆర్, ఎన్‌సీడీఐఆర్‌లు అంచనా వేశాయి. రాష్ట్రంలోని క్యాన్సర్‌ పరిస్థితిపై ఐసీఎంఆర్‌, ఎన్‌సీడీఐఆర్‌ విడుదల చేసిన నివేదికలో ఈ వాస్తవాలు వెల్లడయ్యాయి. పట్టణ జనాభాలో రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తులు, నోరు, అన్నవాహిక, గర్భాశయం క్యాన్సర్ పెరుగుతున్నాయని హెచ్చరించారు.

Read more : ‘Cordyceps sinensis’ : హిమాలయాల్లో పెరిగే ఈ ఫంగస్‌తో క్యాన్సర్‌కు మెడిసిన్ : ఆక్స్‌ఫర్డ్ పరిశోధకుల వెల్లడి

అపోలో హాస్పిటల్ లో అధునాతన క్యాన్స్ర్ చికిత్స కోసం ట్రూబీమ్ రేడియోథెరపీ వ్యవస్థను ప్రారంభించిన సందర్భంగా తెలంగాన గవర్నర్ తమిళసై మాట్లాడుతు..మూడుదశాబ్దాల్లో లక్షకు 75 కేసులు పెరిగాయి అంటే ఇది ఆందోళన కలిగించే విషయం అని అన్నారు. 2020లో భారత్ లో దాదాపు 13.25 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదుకాగా వారిలో 8.5 లక్షలమంది మరణించారని ఆమెతెలిపారు.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR),నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్ (NCDIR) బెంగుళూరు ఇటీవల భారతదేశ క్యాన్సర్ కేసులలో గణనీయమైన పెరుగుదలను సూచించాయి.వచ్చే ఐదేళ్లలో ఇది మరింత 12 శాతం పెరుగుతుందని అంచనా వేసింది.

Read more : Inspiration Man Jayant Kandoi : ఆరుసార్లు క్యాన్సర్ ను జయించిన 23 ఏళ్ల యువకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..

‘ప్రొఫైల్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ అండ్‌ రిలేటెడ్‌ ఫ్యాక్టర్స్‌-తెలంగాణ’ పేరుతో ఐసీఎంఆర్, ఎన్‌సీడీఐఆర్‌ అధ్యయనాల ప్రకారం.. రాష్ట్రంలో 2020లో 47,620 క్యాన్సర్‌ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 0-19 మధ్య వయసువారే అధికంగా ఉంటున్నారు. నాలుగేళ్లలో ఆ సంఖ్య 53,565కు చేరుతుంది. ఏడాదికి సగటున 3,865 కేసులు నమోదవుతున్నాయి. పురుషుల్లో 42.2 శాతం, మహిళల్లో 13.5 శాతం మందికి పొగాకు వల్ల క్యాన్సర్‌ వస్తోంది. అంటే మొత్తం బాధితుల్లో 55 శాతం మంది పొగాకు కారణంగా క్యాన్సర్‌ బారినపడుతున్నారు. పురుషుల్లో ఎక్కువగా నోటి (13.3 శాతం), ఊపిరితిత్తులు (10.9 శాతం), నాలుక (7.9 శాతం) క్యాన్సర్లు వస్తున్నాయి. మహిళలు రొమ్ము (35.5 శాతం), గర్భాశయ ముఖద్వార (8.7 శాతం), అండాశయ (6. 9 శాతం) క్యాన్సర్‌ బారినపడుతున్నారు.

Read more : Inspiration Man Jayant Kandoi : ఆరుసార్లు క్యాన్సర్ ను జయించిన 23 ఏళ్ల యువకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..
నిమ్స్‌ ఆసుపత్రిలో 2014లో ఏర్పాటు చేసిన పాపులేషన్‌ బేస్డ్‌ క్యాన్సర్‌ రిజిస్ర్టీ (పీబీసీఆర్‌) లో ఈ కేసులను నమోదు చేస్తున్నారు. దీని పరిధిలో నిమ్స్‌, బసవతారకం ఇండో అమెరికన్‌, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రులు ఉన్నాయి.ఈ రిజిస్ట్రీ సమాచారం ఆధారంగా ఐసీఎంఆర్‌, ఎన్‌సీడీఐఆర్‌ ఈ నివేదికను రూపొందించి విడుదల చేశాయి. 74 ఏళ్లలోపు ఎప్పుడైనా కాన్సర్‌ వచ్చే అవకాశముందని నివేదిక పేర్కొంది. పొగాకును నియంత్రిస్తే ఈ మహమ్మారిని కొంత మేరకు తగ్గించడానికి అవకాశముందని సూచించింది.