Hyderabad : హయత్‌నగర్ వృద్ధురాలి మర్డర్ కేసుని 24గంటల్లోనే ఛేదించిన పోలీసులు.. చంపింది ఎవరో, ఎందుకో తెలుసా

Hyderabad : ఒంటరి మహిళను దారుణంగా హతమార్చి బంగారం దోచుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సత్తెమ్మ..

Hyderabad : హయత్‌నగర్ వృద్ధురాలి మర్డర్ కేసుని 24గంటల్లోనే ఛేదించిన పోలీసులు.. చంపింది ఎవరో, ఎందుకో తెలుసా

Hyderabad

Hyderabad – Hayath Nagar Old Woman : హైదరాబాద్ లో సంచలనం రేపిన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వృద్ధురాలి మర్డర్ కేసుని ఛేదించారు ఎల్బీనగర్ పోలీసులు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి దగ్గరి నుంచి 23తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ 12లక్షల 60వేల రూపాయలు ఉంటుందన్నారు పోలీసులు. రాకేశ్, లలిత అనే ఇద్దరు వృద్ధురాలు సత్తెమ్మను హత్య చేసినట్లు గుర్తించామన్నారు. వృద్ధురాలి హత్య కేసుని సవాల్ గా తీసుకున్న రాచకొండ పోలీసులు.. 24గంటల్లోనే మర్డర్ మిస్టరీని ఛేదించారు.

హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొర్రూరు గ్రామంలో ఒంటరి మహిళను దారుణంగా హతమార్చి బంగారం దోచుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సత్తెమ్మ అనే వృద్ధురాలిపై ఆదివారం(జూన్ 4) రాత్రి 10 గంటల సమయంలో దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న 23 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.(Hyderabad)

అయితే బీరువా తాళాలు పక్కనే ఉన్నప్పటికీ నిందితులు వాటి జోలికి వెళ్లకపోవడం, మృతురాలి పక్కనే మరో బంగారు గాజు లభించటంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో విచారణ చేపట్టి 24గంటల్లోనే మర్డర్ మిస్టరీని చేధించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. దొంగిలించబడిన 23 తులాల బంగారాన్ని వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రేపు(జూన్ 6) కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.

Also Read..Vizianagaram : కూతురిని హీరోయిన్ చేయాలని, ఆ భాగాలు త్వరగా పెరగాలని హార్మోన్ ఇంజెక్షన్లు.. కసాయి తల్లి అరెస్ట్

దురాశతోనే నిందితులు వృద్ధురాలిని హత్య చేశారని ఎల్బీ నగర్ డీసీపీ సాయిఅనుశ్రీ గౌడ్ లిపారు. మృతురాలి నుంచి దొంగిలించబడ్డ మొత్తం బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.(Hyderabad)

నిందితుల్లో ఒకరైన లలిత.. వృద్ధురాలి ఇంట్లో అద్దెకు ఉంటోంది. తనకు పరిచయం ఉన్న రాకేశ్ తో కలిసి లలిత దారుణానికి ఒడిగట్టింది. రాకేశ్.. వృద్ధురాలికి చిన్న చిన్న సాయాలు చేసి పెట్టేవాడు. అలా లలిత, రాకేశ్.. వృద్ధురాలికి దగ్గరయ్యారు. ఈ హత్యకు ప్రధాన కారణం వృద్ధురాలి ఒంటి మీదున్న 23తులాల బంగారం మీద ఆశే అని పోలీసులు చెప్పారు.

Khammam : ఖమ్మంలో మెడికో విద్యార్థిని ఆత్మహత్య.. నిప్పు అంటించుకుంది.. అసలేం జరిగింది

”హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వృద్ధురాలి హత్య కేసును ఛేదించాము. బంగారం కోసమే ఈ హత్య జరిగింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశాం. రాకేశ్, లలితను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. నారాయణ పేట్ కు చెందిన రాకేశ్ ముత్తుట్ ఫైనాన్స్ లో పనిచేస్తాడు. లలిత.. వృద్ధురాలి కాళ్లు పట్టుకోగా.. రాకేశ్ గొంతు నులిమి హత్య చేశాడు. రాకేశ్, లలితకు సాన్నిహిత్యం ఉంది. బంగారం మీద ఆశతో.. సత్తెమ్మను చంపాలని గతంలో కూడా వీరిద్దరూ ప్లాన్ చేశారు” అని ఎల్బీ నగర్ డీసీపీ సాయిఅనుశ్రీ గౌడ్ వివరించారు.