Inter Exam: గంటన్నరలోనే ఇంటర్ ఫస్టియర్ పరీక్ష

ఇంటర్మీడియట్‌ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది విద్యాశాఖ. సెకండ్ ఇయర్ స్టూడెంట్లకు ఫస్టియర్ ఆధారంగా మార్కులు నిర్ణయించి పాస్ చేశారు. మరి మొదటి సంవత్సరం చదివే విద్యార్థుల కేటాయింపు ఎలా చేయాలా అనేది తేలకుండా పోయింది.

Inter Exam: గంటన్నరలోనే ఇంటర్ ఫస్టియర్ పరీక్ష

Inrter Exams

Inter Exam: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది విద్యాశాఖ. సెకండ్ ఇయర్ స్టూడెంట్లకు ఫస్టియర్ ఆధారంగా మార్కులు నిర్ణయించి పాస్ చేశారు. మరి మొదటి సంవత్సరం చదివే విద్యార్థుల కేటాయింపు ఎలా చేయాలా అనేది తేలకుండా పోయింది. ఒకవేళ 35 శాతం మార్కులతో అందరినీ పాస్ చేయాలని భావిస్తే కొందరు దానికి విముఖంగా కనిపించారు.

దీంతో పరీక్షలు నిర్వహించడానికే మొగ్గు చూపుతుంది విద్యాశాఖ. ఈ క్రమంలోనే పరీక్షల సమయాన్ని కుదించాలని విద్యాశాఖ చర్చలు జరుపుతుంది. మూడు గంటల పాటు ఉండే పరీక్షా సమయం.. కరోనా నేపథ్యంలో గంటన్నరకు కుదించాలనుకుంటున్నారు.

పరీక్షలు రద్దు చేసి ఫస్టియర్‌ విద్యార్థులను సెకండియర్‌కు ప్రమోట్‌ చేశారు. ఈ ఏడాది మళ్లీ వైరస్‌ విజృంభించి మరోసారి పరీక్షలను రద్దు చేస్తే పరిస్థితి గందరగోళంగా మారనుంది. ప్రస్తుతం కరోనా ఉధృతి తక్కువగా ఉన్న సమయంలోనే సెకండియర్‌ విద్యార్థులకు వచ్చే నెల్లో ఫస్టియర్‌ పరీక్షలు నిర్వహించాలని అనుకుంటున్నారు.

ప్రశ్నపత్రాలను కూడా సులువుగా ఉండేలా చూడాలని భావిస్తున్నారు. విద్యార్థులు పరీక్ష రాయడానికి ముందుగా చెల్లించిన వారు మళ్లీ చెల్లించనవసరం లేదు. చెల్లించాల్సిన వారు ఇప్పుడు ఫీజు చెల్లించి పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం మరో రెండుమూడ్రోజుల్లో స్పష్టత ఇవ్వనుంది.