Jagga Reddy: రేవంత్ రెడ్డి దిగిన తర్వాత నేను టీపీసీసీ అధ్యక్షుడిని అవుతా: జగ్గారెడ్డి

Jagga Reddy: రేవంత్ రెడ్డి దిగిన తర్వాత నేను టీపీసీసీ అధ్యక్షుడిని అవుతా: జగ్గారెడ్డి

Jagga Reddy

Jagga Reddy: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్ష పదవిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగిన నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి కాసేపు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి దిగిన తర్వాత తాను టీపీసీసీ అధ్యక్షుడిని అవుతానని అన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డిని బలవంతంగా దించేసి టీపీసీసీ అధ్యక్షుడు కావడం సాధ్యమయ్యే పని కాదని ఆయన వ్యాఖ్యానించారు.

తాము పరస్పరం తిట్టుకున్నప్పటికీ మళ్ళీ కొన్ని గంటల్లోనే కలిసిపోతామని జగ్గారెడ్డి అన్నారు. తామిద్దరి మధ్య ఎటువంటి విభేదాలూ లేవని రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి చేసే పాదయాత్రకు తన మద్దతు ఉంటుందని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు పెద్ద స్కామ్ చేశాయని జగ్గారెడ్డి ఆరోపించారు.

ఆ రెండు పార్టీలూ ఒకటేనని చెప్పారు. కాగా, కొన్ని రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు దీనిపై చర్చలు జరుపుతున్నారు. అలాగే, తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన విషయంపై కూడా వారు ప్రణాళికలు వేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న వేళ ఈ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది.

YS Sharmila: ఆగినచోటి నుంచే మళ్ళీ పాదయాత్ర.. వరంగల్ వెళ్తా: షర్మిల