Judicial Remand : తల్లీకొడుకు ఆత్మహత్య కేసులో నిందితులకు రిమాండ్

తల్లీకొడుకు పద్మ, సంతోష్ ఆత్మహత్య కేసులో ఏడుగురు నిందితుల్లో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు ఉన్నారు. అయితే సీఐ నాగార్జునను అరెస్టు చేయకపోవడంపై పలు అనుమానాలు ఉన్నాయి.

Judicial Remand : తల్లీకొడుకు ఆత్మహత్య కేసులో నిందితులకు రిమాండ్

Accused Remand (1)

mother-son suicide case : రామాయంపేట తల్లీకొడుకు ఆత్మహత్య కేసులో నిందితులకు కామారెడ్డి కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ కామారెడ్డి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిందితులను కామారెడ్డి కోర్టు నుంచి నిజామాబాద్ లోని జైలుకు తరలించారు. నిన్న లొంగిపోయిన నిందితులను పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపర్చడంతో కోర్టు వారికి 14 రోజులపాటు జ్యూడీ
షియల్ రిమాండ్ విధించింది.

తల్లీకొడుకు పద్మ, సంతోష్ ఆత్మహత్య కేసులో ఏడుగురు నిందితుల్లో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు ఉన్నారు. అయితే సీఐ నాగార్జునను అరెస్టు చేయకపోవడంపై పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రామాయంపేటకు చెందిన తల్లీకొడుకులు పద్మ, సంతోష్ కామారెడ్డిలోని ఓ లాడ్జీలో ఆత్మహత్య చేసుకున్నారు.

Ramayampet : రామాయంపేట తల్లీ, కొడుకుల ఆత్మహత్య కేసులో 6 నిందితులు అరెస్ట్

తమను ఏడుగురు వేధిస్తున్నారని సూసైడ్ కు ముందు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోర్టు.. నిందితులకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. కామారెడ్డి కోర్టు నుంచి నిజామాబాద్ జైలుకు నిందితులను పోలీసులు తరలించారు.