Kishan Reddy Budget : బడ్జెట్ ప్రసంగం.. టీఆర్ఎస్ ప్రభుత్వం వీడ్కోలు ప్రసంగంలా ఉంది-కిషన్ రెడ్డి

అసెంబ్లీ సమావేశాలు ప్రజాస్వామ్య బద్దంగా లేవని Kishan Reddy Budget అన్నారు. బడ్జెట్ ప్రసంగం టీఆర్ఎస్ ప్రభుత్వం వీడుకోలు ప్రసంగంలా ఉందన్నారు.

Kishan Reddy Budget : బడ్జెట్ ప్రసంగం.. టీఆర్ఎస్ ప్రభుత్వం వీడ్కోలు ప్రసంగంలా ఉంది-కిషన్ రెడ్డి

Kishan Reddy (1)

Kishan Reddy Budget : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, బడ్జెట్ ప్రసంగంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రజాస్వామ్య బద్దంగా లేవని ఆయన అన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రం కూడా గవర్నర్ ను ఈ విధంగా అవమాన పరచలేదన్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభించారని తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు.

గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడం దిగజారుడుతనం అని ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు జరుపుతున్నందుకు బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపితే వారిని సస్పెండ్ చేయడం దారుణం అన్నారు. పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు ఉభయసభల్లో ఆందోళన చేసినా కేంద్రం సస్పెండ్ చేయలేదని కిషన్ రెడ్డి (Kishan Reddy Budget) గుర్తు చేశారు.

రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ను, గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం అవ‌మానించిన రీతిన ఏ పార్టీ ప్ర‌భుత్వం కూడా అవ‌మానించ‌లేద‌ని ఆయ‌న వాపోయారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండా ఏనాడు అసెంబ్లీ స‌మావేశాల‌ను ప్రారంభించ‌లేద‌ని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్ర‌భుత్వం దారి త‌ప్పిన‌ప్పుడు ప్ర‌శ్నించే అధికారం ఎమ్మెల్యేల‌కు ఉంటుంద‌న్న కిషన్ రెడ్డి.. ప్ర‌శ్నించే గొంతు నొక్కేందుకే బీజేపీ ఎమ్మెల్యేల‌ను సస్పెండ్ చేశార‌ని ఆరోపించారు. బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలు రాజా సింగ్‌, ర‌ఘునంద‌న్ రావు, ఈట‌ల రాజేంద‌ర్‌ పై విధించిన స‌స్పెన్ష‌న్‌ను త‌క్ష‌ణ‌మే ఎత్తేయాలిన కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

TS Budget 2022-23 : సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకోవటానికి రూ.3 లక్షలు : మంత్రి హరీశ్ రావు

”ప్రగతి భవన్ లో రాసిన సస్పెండ్ తీర్మానం ప్రకారం ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. సభలో ఈటల రాజేందర్ ను చూడాల్సి వస్తుంది కాబట్టి సభ ప్రారంభమైన 10 నిమిషాలకే సస్పెండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యతిరేకంగా పాలకులు వ్యవహరిస్తున్నపుడు ప్రశ్నించే అధికారం మా సభ్యులకు ఉంటుంది. బడ్జెట్ ప్రసంగం టీఆర్ఎస్ ప్రభుత్వం వీడుకోలు ప్రసంగంలా ఉంది. ఒక ఏడాది ముందే వీడుకోలు ప్రసంగంలా ఉంది.

నూతన రాష్ట్రంలో నూతనంగా ప్రగతి భవన్ మాత్రం నిర్మించుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఉస్మానియా ఆసుపత్రి మూతపడింది. బడ్జెట్ లో 130 లైన్లు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి రాశారు. రాష్ట్ర ప్రభుత్వం పెడతానన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదో చెప్పాలి. విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు కల్పించకపోవడం వల్ల గిరిజనులకు అన్యాయం జరుగుతుంది.

ఎంఎంటీఎస్ లో రాష్ట్ర వాటా ఇవ్వలేదని, కేంద్ర పథకాల నిధులు తమ నిధులుగా బద్దెట్ లో చూపారు. అప్పులు కూడా చెబితే బాగుండేది. అంబేద్కర్ పేరు తీసే అర్హత కూడా టీఆర్ఎస్ కు లేదు. రాజ్యాంగ స్ఫూర్తిని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండాల్సింది. కానీ అది జరగలేదు. గవర్నర్ ను అవమానించారు. దళితబంధుకు కేటాయించిన నిధులతో వచ్చే 15 ఏళ్లైనా దళితులకు మేలు జరగదు. టీఆర్ఎస్ నాయకులకు మేలు జరిగేలా దళిత బంధు ఉంది” అని కిషన్ రెడ్డి విమర్శలు చేశారు.

TS Budget 2022-23 : ప్రభుత్వ ఖజానాకు ఎంత ధనం వచ్చిందనేది కాదు..అది ప్రజలకు ఎంతవరకు చేరిందనేది ముఖ్యం

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2022-23) సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 2.30 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈసారి రూ. 2.56 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. రాష్ట్ర రెవెన్యూ వ్యయం రూ. 1.89 లక్షల కోట్లు, పెట్టుబడి వ్యయం రూ.29 వేల 728 కోట్లు ఉందని అంచనా వేశారు. క్యాపిటల్ వ్యయం రూ.29, 728.44 కోట్లుగా లెక్కగట్టారు. రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 2021-22 భారీగా పెరిగినట్లు, జాతీయ- రాష్ట్ర సగటు ఎక్కువగా ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. కరోనా సమయంలో తెలంగాణ 2శాతం గ్రోత్ లో ఉందని సభకు తెలిపారు. తలసరి ఆదాయం రూ.2లక్ష 78వేల 833కు పెరిగిందన్నారు.