Kishan Reddy : ఇది కేసీఆర్ కుట్రే..! మునుగోడులో ఓటమి భయంతోనే ఈ డ్రామా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ ఎదురుదాడి

ఇదంతా కేసీఆర్ కుట్రే అని ఆరోపిస్తున్నారు. ఇలాంటి వాటిలో కేసీఆర్ దిట్ట అని విమర్శించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిందంతా పెద్ద డ్రామా అని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు.

Kishan Reddy : ఇది కేసీఆర్ కుట్రే..! మునుగోడులో ఓటమి భయంతోనే ఈ డ్రామా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ ఎదురుదాడి

Kishan Reddy : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కు కొద్ది సమయానికి ముందు కలకలం రేగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. భారీ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు ఆపరేషన్ ఆకర్ష్ గుట్టు రట్టు చేశారు. మరోసారి ఓటుకు నోటు సీన్ రిపీట్ అయ్యిందని, దీని వెనుక బీజేపీ కుట్ర ఉందని, ఢిల్లీ కేంద్రంగానే ఈ కుట్ర జరిగిందని, తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే ప్రయత్నం జరిగిందని, ఎమ్మెల్యేలతో బేరసారాల పని బీజేపీదే అని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ టార్గెట్ గా నిప్పులు చెరుగుతున్నారు.

ఈ ఆరోపణలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. టీఆర్ఎస్ పై ఎదురుదాడికి దిగారు. ఇదంతా కేసీఆర్ కుట్రే అని వారు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వాటిలో కేసీఆర్ దిట్ట అని విమర్శించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిందంతా పెద్ద డ్రామా అన్నారు. మునుగోడులో ఓటమి భయంతోనే అధికార టీఆర్ఎస్ పార్టీ ఇంత డ్రామా ఆడిందన్నారు. ఇది డ్రామా కాదని యాదాద్రిలో కేసీఆర్ ప్రమాణం చేస్తారా? అని సవాల్ చేశారు. చిల్లర రాజకీయాలు చేయడంలో కేసీఆర్ పెద్ద దిట్ట అని బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ప్రగతి భవన్ కేంద్రంగానే ఎమ్మెల్యేల కొనుగోళ్ల డ్రామా నడిచిందన్నారు. ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం బీజేపీకి లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అసలు ఆ నలుగురు ఎమ్మెల్యేలతో(గువ్వల బాలరాజు, పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్దన్ రెడ్డి) బీజేపీకి ఎలాంటి లాభమూ లేదన్నారాయన. మా దగ్గర రూ. వంద కోట్లు ఎక్కడివి అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మునుగోడులో ఓడిపోతారనే కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వారికి వంద కోట్లు బీజేపీకి ఏం లాభం అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

‘వాళ్లు ఎవరు అసలు, మా పార్టీలోకి వస్తే ఏం లాభం? వాళ్లు బీజేపీలోకి వస్తే వాళ్లను చూసి మాకు ఓట్లు వేస్తారా? వాళ్లసలు మునుగోడికి ఏం సంబంధం? వాళ్లు వచ్చినా మాకు ఒక్క ఓటు కూడా రాదు. నాడు రేవంత్ రెడ్డి మీద వేసిన స్కెచ్ నేడు మా మీద వేశారు’ అని కిషన్ రెడ్డి అన్నారు.