KTR: ఈ పెట్రో ధరల భారం తగ్గాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది: కేటీఆర్

కేంద్ర ప్రభుత్వమే ఒక దోపిడీదారుగా మారి ప్రజల జేబులో నుంచి దోచుకుంటోందని, ఈ పెట్రో భారం తగ్గాలంటే బీజేపీని వదిలించుకోవడమే ఏకైక మార్గమని తెలిపారు. పెట్రో ధరల పేరిట దోపిడీ జరుగుతోందని విమర్శించారు.

KTR: ఈ పెట్రో ధరల భారం తగ్గాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది: కేటీఆర్

Minister KTR

KTR: పెట్రో ధరల పెరుగుదలపై మండిపడుతూ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వమే ఒక దోపిడీదారుగా మారి ప్రజల జేబులో నుంచి దోచుకుంటోందని, ఈ పెట్రో భారం తగ్గాలంటే బీజేపీని వదిలించుకోవడమే ఏకైక మార్గమని తెలిపారు. పెట్రో ధరల పేరిట దోపిడీ జరుగుతోందని విమర్శించారు. పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ అన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేశారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను నిలువునా దోచుకుంటున్నదని కేటీఆర్ చెప్పారు. 2013లో ఒక బ్యారెల్ ముడిచమురు ధర 110 డాలర్లు ఉన్నప్పుడు దేశంలో లీటర్ పెట్రోల్ రేటు కేవలం 76 రూపాయలు అని తెలిపారు.

నేడు బ్యారెల్ ముడిచమురు రేటు దాదాపు సగం అంటే 66 డాలర్లకు తగ్గినా, ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ కు 110 రూపాయలు ఉండడమే దోపిడీకి నిదర్శనమని అన్నారు. దేశంలో పెట్రోల్ ధరల పెంపునకు కారణం ముడిచమురు కాదని, మోదీ నిర్ణయించిన చమురు ధరలేనని తాము గతంలో చెప్పిన మాటలు అక్షర సత్యాలని మరోసారి రుజువైందని చెప్పారు. తన కార్పొరేట్ మిత్రుల ఖజానాను లాభాలతో నింపేందుకు మోదీ ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచుతోందని అన్నారు.

పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచడం వల్ల దేశంలోని పేద, సామాన్య మధ్యతరగతి ప్రజానీకం ధరల భారంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతోందని తెలిపారు. 2014 నుంచి ఇప్పటిదాకా దాదాపు 45 శాతం పైగా పెట్రో ధరల పెంపు వల్ల సరుకు రవాణా భారమై, సామాన్యుడు కొనుగోలు చేసే ప్రతి సరుకు ధర భారీగా పెరిగిందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ దోపిడీని ఆపాలని, లేకుంటే ప్రజల చేతిలో కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

Tamil Nadu: పెరుగు ప్యాకెట్లపై “దహీ” అని హిందీలో రాయాలంటూ ఆదేశాలు.. చివరకు తమిళనాడు దెబ్బకు..