Kishan Reddy: వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకు విమోచన దినోత్సవాలు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

విమోచన దినోత్సవాలను తెలంగాణ వ్యాప్తంగా వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకు నిర్వహిస్తామని వెల్లడించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శనివారం సికింద్రాబాద్‌లో భారీ స్థాయిలో విమోచన దినోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొంటున్నారు.

Kishan Reddy: వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకు విమోచన దినోత్సవాలు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy: హైదరాబాద్ (తెలంగాణ) విమోచన దినోత్సవాలను వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకు నిర్వహిస్తామని వెల్లడించారు కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. శనివారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవ వేడుకల్ని భారీగా నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే.

Sachin Tendulkar: మాజీ స్టార్ ప్లేయర్లతో విమానంలో సచిన్.. అభిమానుల్ని ఏం అడిగాడో తెలుసా!

సాయంత్రం ఐదు గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన 1,300 మంది కళాకారులు ప్రదర్శన ఇస్తారని ఆయన అన్నారు. ఈ అంశంపై సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘‘హైదరాబాద్-కర్ణాటక ముక్తి దివస్ పేరుతో ప్రతి సంవత్సరం కర్ణాటక ప్రభుత్వం సెప్టెంబర్ 17న ఉత్సవాలు నిర్వహిస్తోంది. మహారాష్ట్రలో కూడా మరఠ్వాడా ముక్తి దివస్ పేరుతో అధికారిక వేడుకలు నిర్వహిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటి నుంచే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. హైదరాబాద్ నిజాం పాలనలోని కొన్ని జిల్లాలు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కర్ణాటక, మహారాష్ట్రలో కలిశాయి.

Caught On Camera: టోల్ ప్లాజా దగ్గర గొడవ.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న మహిళలు.. వీడియో వైరల్

అందువల్లే అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ, నిజాం పాలించిన హైదరాబాద్ నగరంలో మాత్రం 1948, సెప్టెంబర్ 17 నుంచి ఈ రోజు వరకు అధికారికంగా ఏ ప్రభుత్వమూ కార్యక్రమం నిర్వహించలేదు. కేంద్ర ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ సారి హైదరాబాద్‌లో వేడుకలు నిర్వహిస్తున్నాం. నిజమైన దేశ చరిత్రను భావి తరాల ముందు ఉంచే ప్రయత్నం చేస్తోంది. శనివారం నిర్వహించే కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు, మహారాష్ట్ర, కర్ణాటక ముఖ్యమంత్రులను కూడా స్వయంగా ఆహ్వానించా’’ అని కిషన్ రెడ్డి అన్నారు.