Munugodu By Poll : నేటి నుండి మునుగోడు కదనరంగంలోకి ప్రధాన పార్టీలు.. 14 మంది మంత్రులకు ఇంచార్జ్ బాధ్యతలు

మునుగోడు ఉప ఎన్నికకు రేపు నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రధాన పార్టీలు నేటి నుండి మునుగోడు కదనరంగంలోకి దూకనున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు ఇంచార్జ్ లను నియమించాయి. టిఆర్ఎస్ ఒక్కో ఎంపీటీసీ పరిధి ఒక్కో కీలక నేతకు బాధ్యత అప్పగించింది. మొత్తం 86 మంది ఇంచార్జ్ లు నియామకం అయ్యారు. మంత్రులకు సైతం ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు.

Munugodu By Poll : నేటి నుండి మునుగోడు కదనరంగంలోకి ప్రధాన పార్టీలు.. 14 మంది మంత్రులకు ఇంచార్జ్  బాధ్యతలు

munugodu by poll

Munugodu By Poll  : మునుగోడు ఉప ఎన్నికకు రేపు నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రధాన పార్టీలు నేటి నుండి మునుగోడు కదనరంగంలోకి దూకనున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు ఇంచార్జ్ లను నియమించాయి. టిఆర్ఎస్ ఒక్కో ఎంపీటీసీ పరిధి ఒక్కో కీలక నేతకు బాధ్యత అప్పగించింది. మొత్తం 86 మంది ఇంచార్జ్ లు నియామకం అయ్యారు. మంత్రులకు సైతం ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు.

గట్టుప్పల్-1 ఎంపీటీసీ పరిధి ఇంచార్జ్ గా మంత్రి కేటీఆర్, మర్రిగూడ ఎంపిటిసి పరిధి ఇంచార్జ్ గా మంత్రి హరీష్ రావు, మునుగోడు-1 ఎంపిటిసి పరిధి ఇంచార్జ్ గా మంత్రి జగదీష్ రెడ్డి నియమించారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి మొత్తం నియోజకవర్గాన్ని సైతం పర్యవేక్షించనున్నారు. మొత్తం 14 మంది మంత్రులకు బాధ్యతలు అప్పగించారు.

Munugodu bypoll schedule: నవంబరు 3న మునుగోడు ఉప ఎన్నిక.. షెడ్యూల్ విడుదల

మరోవైపు కాంగ్రెస్.. 2, 3 గ్రామాలను క్లస్టర్ గా విభజించి బాధ్యులను కేటాయించింది. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప ఎన్నికల కమిటీ ఏర్పాటు చేశారు. ఇదిలావుంటే బీజేపీ మండలాల వారీగా ఇంచార్జ్ లను నియమించింది. మాజీ ఎంపీ వివేక్ ఆధ్వర్యంలో స్టీరింగ్ కమిటీ వేసింది. పాత, కొత్త నేతలు సమన్వయం చేసుకునేలా బాధ్యతలు అప్పగించింది.

ఆయా పార్టీలు బూత్ స్థాయిలో ప్రభావం చూపేలా కింది స్థాయిలో సబ్ కమిటీలు వేసుకున్నాయి. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతిని అధిష్టానం ప్రకటించింది. బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో దిగనున్నారు. టీఆర్ఎస్ నుండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు దాదాపు ఖరారు అయింది. రేపటి నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

Munugode bypoll on November 3: మునుగోడులో మూడు ముక్కలాట..!

మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. వచ్చే శాసనసభ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా మునుగోడు బైపోల్ మారింది. గెలిచే అభ్యర్థితో రెండవ స్థానం పైనా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.