Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగడం వెనుక కుట్రకోణం? ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

పిల్లర్ నెంబర్ 20 దగ్గర పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఎవరైనా కుట్ర జరిపి ఉంటారని.. Medigadda Barrage

Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగడం వెనుక కుట్రకోణం? ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

Medigadda Barrage Damage

Medigadda Barrage Damage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్ కుంగడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. పిల్లర్ కింద భారీ శబ్దం రావడంతో కుట్రకోణం ఉందన్న అనుమానంతో అధికారులు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పిల్లర్లు కుంగటంపై కుట్ర ఉందని అధికారులు అంటున్నారు.

ఎన్నికలు నేపథ్యంలో కుట్ర చేసి ఉంటారని అనుమానాలు..
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ నెంబర్ 20 కుంగిపోవడంపై కొంత అనుమానాలు వ్యక్తం చేస్తూ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ పోలీసులకు ఇరిగేషన్ అధికారి రవికాంత్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 427 ఐపీసీ 3 అండ్ 4 పబ్లిక్ డ్యామేజ్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎవరైనా కుట్ర చేసి ఉంటారు అనే అనుమానాలను ఇరిగేషన్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

Also Read : టార్గెట్ రేవంత్ రెడ్డి.. పాలేరుతో పాటు కొడంగల్ నుంచి వైఎస్ షర్మిల పోటీ?

ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు?
ఇందులో కుట్రకోణం దాగి ఉందని, ఎందుకంటే పిల్లర్ నెంబర్ 20 దగ్గర పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో కొంత అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఎవరైనా కుట్ర జరిపి ఉంటారనే అనుమానాలను ఇరిగేషన్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాఫ్తు జరిపించాలని ఇరిగేషన్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహదేవ్ పూర్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. మరోవైపు ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు కేంద్ర బలగాలు కూడా ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్నాయి. ఎక్కడెక్కడ శబ్దాలు వచ్చాయి? అనే దానిపై అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నాయి.

Also Read : తెలంగాణకు వస్తున్న అమిత్ షా, పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యే అవకాశం..పొత్తులు, సీట్లపై క్లారిటీ వచ్చేనా..?

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్ట్ అంత మామూలుగా కుంగిపోయే అవకాశమే లేదని, దీని వెనుక ఏదైనా కుట్ర దాగి ఉంది అనే అనుమానాలు ఇరిగేషన్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసు శాఖ అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు.

పెద్ద శబ్దంతో కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన..
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ వంతెన పెద్ద శబ్దంతో కుంగింది. బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య వంతెన ఒక అడుగు మేర కుంగింది. బ్యారేజీ 20వ పిల్లర్ కుంగడంతో పైనున్న వంతెన కూడా కుంగినట్టు అధికారులు వెల్లడించారు. ఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర నుంచి 356 మీటర్ల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య బ్యారేజీ వంతెన మీదుగా వాహనరాకపోకలను నిలిపివేశారు. నీటిపారుదల శాఖ ఇంజినీర్లు డ్యాం పరిసర ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు.

Also Read : కుంగిన మేడిగడ్డ బ్యారేజీ.. కారణం ఏంటో చెప్పిన ఈటల రాజేందర్, ఇంకా ఎన్ని పిల్లర్లు ధ్వంసమయ్యాయో అని ఆందోళన

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో మేడిగడ్డ వద్ద నిర్మించారు లక్ష్మీ బ్యారేజీ బ్రిడ్జి. బ్యారేజీ 20వ పిల్లర్‌ కుంగడంతోనే పైన వంతెన కుంగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. లక్ష్మీ బ్యారేజీ మెుత్తం పొడవు 1.6 కిలోమీటర్లు కాగా..ఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది.

గోదావరి నదిపై 2019లో మేడిగడ్డ వద్ద ఈ బ్యారేజీని నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఇది మొదటిది కావటం విశేషం. ఈ బ్యారేజీ సామర్థ్యం 16.17 టీఎంసీలు.

Also Read : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ప్రమాదంపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్