Telangana: తెలంగాణలో 3 రోజులు వర్షాలు పడే అవకాశం

రాష్ట్రంలో ఇవాళ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గాలులతో (గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో) కూడిన వర్షం అక్కడక్కడ పడే అవకాశం ఉంది.

Telangana: తెలంగాణలో 3 రోజులు వర్షాలు పడే అవకాశం

Rain Alert

Telangana – Rains: రానున్న మూడు రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ (Meteorological) కేంద్రం తెలిపింది. నిన్నటి ఆవర్తనం ఇవాళ దక్షిణ చత్తీస్‌గఢ్, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోంది.

ఇవాళ ద్రోణి దక్షిణ చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ రాయలసీమల మీదుగా తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతోంది. దీంతో రానున్న మూడు రోజులు వాతావరణం (Weather Forecast) ఎలా ఉంటుందన్న వివరాలను అధికారులు చెప్పారు.

ఇవాళ, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాగల 7 రోజులు తెలంగాణ రాష్ట్రం అంతటా గరిష్ఠ (పగటి) ఉష్ణోగ్రతలు 42°C నుండి 44°C వరకు స్థిరంగా నమోదు అయ్యే అవకాశం ఉంది.

హైదరాబాద్, చుట్టు ప్రక్కల 2, 3 జిల్లాల్లో ఇవాళ 38°C నుండి 41°C వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. అలాగే, ఇవాళ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గాలులతో (గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో) కూడిన వర్షం రాష్ట్రంలో అక్కడక్కడ పడే అవకాశం ఉంది.

Girls Break Piggy Bank : రూ.2000 నోట్ల కోసం పిగ్గీ బ్యాంకును బద్దలు కొట్టారు.. ఆ తరువాత ఏమైంది?