Harish Rao : రైతులకు శుభవార్త, 24 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు

సిద్ధిపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల‌పై సిద్దిపేట క‌లెక్ట‌రేట్ నుంచి మంత్రి హ‌రీష్ రావు అధికారుల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ధాన్యం కొనుగోలు చేసిన అనంత‌రం రైతుల‌కు డ‌బ్బులు చెల్లించేందుకు సీఎం కేసీఆర్ రూ.26వేల కోట్లు సిద్ధంగా ఉంచార‌ని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంట‌ల్లోనే రైతుల ఖాతాలో డ‌బ్బు జ‌మ అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Harish Rao : రైతులకు శుభవార్త, 24 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు

Harish Rao

Harish Rao : సిద్ధిపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల‌పై సిద్దిపేట క‌లెక్ట‌రేట్ నుంచి మంత్రి హ‌రీష్ రావు అధికారుల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ధాన్యం కొనుగోలు చేసిన అనంత‌రం రైతుల‌కు డ‌బ్బులు చెల్లించేందుకు సీఎం కేసీఆర్ రూ.26వేల కోట్లు సిద్ధంగా ఉంచార‌ని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంట‌ల్లోనే రైతుల ఖాతాలో డ‌బ్బు జ‌మ అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. మిల్లులో ధాన్యం దించిన వెంట‌నే ట్యాబ్ ఎంట్రీ పూర్తి కావాల‌న్నారు.

ట్యాబ్ ఎంట్రీ పూర్తి కాగానే రైతుల ఖాతాలో డ‌బ్బులు జ‌మ చేయాల‌ని ఆదేశించారు. టార్ఫ‌లీన్, గ‌న్ని బ్యాగుల కొర‌త‌, ట్రాన్స్‌పోర్టు ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూడాల‌న్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు, చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే కొనుగోలు కేంద్రం ఇంచార్జీ అధికారిదే బాధ్యత అని హ‌రీష్ రావు తేల్చి చెప్పారు.