KTR: మంత్రి కేటీఆర్‌కు కోవిడ్ పాజిటివ్.. ట్విట్టర్ ద్వారా వెల్లడి

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్‌కు కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు.

KTR: మంత్రి కేటీఆర్‌కు కోవిడ్ పాజిటివ్.. ట్విట్టర్ ద్వారా వెల్లడి

KTR: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా మంగళవారం సాయంత్రం వెల్లడించారు. కరోనా లక్షణాలు కనబడటంతో పరీక్షలు చేయించుకున్నట్లు, ఈ పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు ఆయన తెలిపారు.

Revanth Reddy: ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయడమే టీఆర్ఎస్, బీజేపీ ఎజెండా: రేవంత్ రెడ్డి

ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటూ, పరీక్షలు చేయించుకోవాలని కేటీఆర్ కోరారు. ప్రస్తుతం తాను హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. కేటీఆర్‌కు కరోనా సోకడం ఇది రెండోసారి. కొద్ది రోజులక్రితం కాలికి గాయం కారణంగా కొద్ది రోజులు ఇంటికే పరిమితమైన కేటీఆర్.. ఇటీవలే కోలుకున్నారు. తాజాగా మరోసారి కోవిడ్ బారిన పడ్డారు.