Tesla : తెలంగాణలో టెస్లా కేంద్రాన్ని నెలకొల్పండి.. కేటీఆర్ ఆహ్వానం

టెస్లా కంపెనీ వ్యవస్థాకులు సీఈఓ ఎలాన్ మస్క్ కు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆహ్వానం పలికారు...

Tesla : తెలంగాణలో టెస్లా కేంద్రాన్ని నెలకొల్పండి.. కేటీఆర్ ఆహ్వానం

Ktr Tweet

Minister KTR Tesla Company : టెస్లా కంపెనీ వ్యవస్థాకులు సీఈఓ ఎలాన్ మస్క్ కు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆహ్వానం పలికారు. తెలంగాణ రాష్ట్రంలో టెస్లా తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని, కంపెనీతో కలిసి పని చేయడానికి సంతోషిస్తానని వెల్లడించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేయడానికి కారణం ఉంది. భారత్ లో విద్యుత్ కార్లు (టెస్లా) తెచ్చేందుకు సవాళ్లున్నాయని ఎలాన్ మస్క్ వెల్లడించారు. దీంతో మంత్రి కేటీఆర్ స్పందించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంలో తమ రాష్ట్రం ముందున్నదని గుర్తు చేశారు. భారత దేశంలో వ్యాపారాలకు అగ్రశ్రేణి గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు.

Read More : Indian Govt.: విదేశీ హెలికాప్టర్, క్షిపణి దిగుమతి ఒప్పందాలను రద్దు చేసిన కేంద్రం

విద్యుత్ వాహనాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని గత సంవత్సరం భారత్ ను టెస్లా కోరింది. అయితే..ముందు విద్యుత్ కార్ల ఉత్పత్తిని దేశీయంగా ప్రారంభించాలని భారీ పరిశ్రమల శాఖ టెస్లా కంపెనీకి సూచించింది. ఆ సంస్థ కోరిన రాయితీలు ఇతర వాహన సంస్థలకు ఇవ్వడం లేదని వెల్లడించింది. ఒకవేళ టెస్లాకు పన్ను మినహాయింపులు ఇస్తే…ఇతర కంపెనీలకు మంచి సంకేతాలు వెళ్లవని అభిప్రాయం వ్యక్తం చేసింది.

Read More : Election Commission : ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ర్యాలీలు ఉండాలా ? వద్దా, ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ

అయితే…ఎలాన్ మస్క్ ఇటీవలే పలు ఆరోపణలు చేశారు. టెస్లా విద్యుత్ కార్లు తెవాలంటే కొన్ని సమస్యలు నెలకొంటున్నాయని.. ఈ సమస్యల పరిష్కారానికి తాము భారత ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై భారత ప్రభుత్వం స్పందించింది. ఆయన వ్యాఖ్యలను ఖండించింది. ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు మస్క్ ప్రయత్నిస్తున్నారని తెలిపింది. గతంలో అమెరికాకు వెళ్లిన కేటీఆర్…టెస్లా కారును నడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను మరోసారి రీ ట్వీట్ చేశారు.