secunderabad : ‘బిల్డింగ్ మొత్తం మెటీరియల్‌తో నింపేశారు..అందుకే మంటలు అదుపులోకి రావటం కష్టమవుతోంది’ : మంత్రి తలసాని

‘బిల్డింగ్ మొత్తం మెటీరియల్‌తో నింపేశారు..అందుకే మంటలు అదుపులోకి రావటం కష్టమవుతోందని మరో రెండు మూడు గంటల్లో పరిస్థితి చక్కబడుతుందని మంత్రి తలసాని తెలిపారు.

secunderabad : ‘బిల్డింగ్ మొత్తం మెటీరియల్‌తో నింపేశారు..అందుకే మంటలు అదుపులోకి రావటం కష్టమవుతోంది’ : మంత్రి తలసాని

fire breaks out at sports store in secunderabad

secunderabad :  సికింద్రాబాద్ రాంగోపాల్ పేట పరిధిలోని డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ స్టోర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హుటాహుటిన ఘటానా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మంటల ప్రమాదం నుంచి కొంతమందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారని..మంత్రి తెలిపారు. స్టోర్ మొదటి అంతస్తులో చిక్కుకుపోయిన ముగ్గురు వ్యక్తులు చిక్కుకుపోగా, స్కైలిఫ్ట్ సాయంతో వారిని సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు. గత మూడు గంటలుగా ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనస్థలంలో దట్టమైన పొగ అలముకోవటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఈ స్పోర్ట్స్ మాల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.

Secunderabad: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటలు అదుపు చేయలేకపోతున్న సిబ్బంది

ఈ అగ్నిప్రమాదంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని..పోలీసులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని, ఇప్పటికే పలువురిని కాపాడారని తెలిపారు. మరో ఇద్దరిని కాపాడాల్సి ఉందని అన్నారు. వారి ఫోన్ల నుంచి స్పందన రావడంలేదని తెలిపారు.

ఈ భవనంలో క్లాత్ మెటీరియల్ పెద్ద ఎత్తున నిల్వ ఉండడంతో భారీ స్థాయిలో మంటలు వచ్చాయని..భవనం మొత్తం మెటిరియల్ తో నింపేశారని..అందుకే మంటలు అదుపులోకి రావటంలేదని మరో రెండు మూడు గంటల్లో పరిస్థితి చక్కబడుతుందని తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని..ఎవ్వరు ఆందోళనచెందవద్దని సూచించారు. ఈ అగ్నిప్రమాదం దురదృష్టకరమని..అనుమతులు లేని భవనాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.