MLA Rajasingh PD Act Case : పీడీయాక్ట్ రివోక్ కోసం రాజాసింగ్ యత్నాలు .. మీరు హైకోర్టుకెళితే మేం సుప్రీంకోర్టుకు వెళతామన్న సీపీ ఆనంద్

పీడీయాక్ట్ రివోక్ కోసం రాజాసింగ్ తన లాయర్ల ద్వారా యత్నాలు చేస్తున్నారు. దీంతో పీడీయాక్ట్ రివోక్ కోసం మీరు హైకోర్టుకెళితే మేం సుప్రీంకోర్టుకు వెళతామని సీపీ సీవీ ఆనంద్ అంటున్నారు. పీడీయాక్ట్ కు సంబంధించిన అన్ని ఆధారాలు మా వద్ద ఉన్నాయంటున్నారు సీపీ.

MLA Rajasingh PD Act Case : పీడీయాక్ట్ రివోక్ కోసం రాజాసింగ్ యత్నాలు .. మీరు హైకోర్టుకెళితే మేం సుప్రీంకోర్టుకు వెళతామన్న సీపీ ఆనంద్

MLA Rajasingh PD Act Case

MLA Rajasingh PD act case : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీయాక్ట్‌ నమోదుచేసి అరెస్ట్‌ చేసి చర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి చర్లపల్లి జైల్లోనే ఉన్న రాజాసింగ్ ఓ పక్క తనపై బనాయించిన పీడీయాక్ట్ తొలగించుకునేందుకు..రాజాసింగ్ తన లాయర్ల ద్వారా యత్నిస్తున్నారు. మరోపక్క తనకు బీజేపీ అధిష్టానం నిర్ణయించిన గడువు పొడిగించుకునేందుకు రాజాసింగ్ యత్నిస్తున్నారు. దీంట్లో భాగంగా రాజాసింగ్ లాయర్లు హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. అలాగే బీజేపీ అధిష్టానం తనకు ఇచ్చిన గడువు పెంచుకోవటానికి రాజాసింగ్ తన భార్యను ఢిల్లీకి పంపించారు. పార్టీ లైన్ దాటారన్న అధిష్టానం నోటీసులపై వివరణ ఇచ్చేందుకు రేపటితో గడువు ముగియనుంది. రాజాసింగ్ జైల్లో ఉన్నందున వివరణ ఇచ్చేందుకు మరికొంత కాలం గడువు ఇవ్వాలని రాజాసింగ్ భార్య అధిష్టానాన్ని కోరనున్నారు. బీజేపీ పెద్దలను మరికొంత గడువు ఇవ్వాలని కోరనున్నారు.

Rajasingh Wife Delhi : ఢిల్లీకి వెళ్లిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య

రాజాసింగ్‌పై నమోదు చేసిన పీడీ యాక్ట్‌ను రివోక్‌ చేసేందుకు ఆయన తరఫు లాయర్లు న్యాయస్థానాలను ఆశ్రయించనున్నారు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో పిటిషన్‌ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాజాసింగ్‌ అరెస్ట్‌లో పీడీ యాక్ట్‌ అడ్వైజరీ కమిటీ నిర్ణయం కీలకంగా మారనుంది. పీడీ యాక్ట్‌ ప్రపోజర్స్‌ను అడ్వైజరీ బోర్టు కమిటీ పరిశీలించి..నెలలోపు రాజాసింగ్‌ను అడ్వైజరీ కమిటీ విచారించనుంది. పోలీసులు సమర్పించిన సాక్ష్యాలు, నిందితుడి వివరాలను అడ్వైజరీ బోర్డు కమిటీ పరిశీలించనుంది. ఈ క్రమంలో రాజాసింగ్‌ను ఆయన లాయర్లు ములాఖత్‌ ద్వారా ఇప్పటికే కలిశారు. పీడీయాక్ట్ రివోక్ కోసం రాజాసింగ్ లాయర్టు హైకోర్టును ఆశ్రయించనున్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే రాజాసింగ్ పై పీడీయాక్ట్ నమోదు చేసిన పోలీసులు దానికి సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. రాజాసింగ్ పై ఉన్న పీడీయాక్ట్ ను హైకోర్టు రివోక్ చేస్తే తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సీపీ ఆనంద్ తెలిపారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాజాసింగ్ చేసే యత్నాలు ఫలిస్తాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కాగా..పీడీ యాక్ట్‌ నమోదైన వ్యక్తులు మూడు నెలలు లేదా ఏడాది పాటు జైలులో ఉండే అవకాశం ఉంది. గత 8 ఉళ్లలో పోలీసులు.. 2,573 మందిపై పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. ఏడాది కాలంలో 664 మందిపై పీడీ యాక్ట్‌ నమోదు చేసినట్టు సమాచారం.