Rajasingh Wife Delhi : ఢిల్లీకి వెళ్లిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఢిల్లీకి వెళ్లారు. పార్టీ లైన్ దాటారన్న అధిష్టానం నోటీసులపై వివరణ ఇచ్చేందుకు రేపటితో గడువు ముగియనుంది. రాజాసింగ్ జైల్లో ఉన్నందున వివరణ ఇచ్చేందుకు మరికొంత కాలం గడువు ఇవ్వాలని రాజాసింగ్ భార్య అధిష్టానాన్ని కోరనున్నారు.

Rajasingh Wife Delhi : ఢిల్లీకి వెళ్లిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య

Rajasingh wife Delhi

Rajasingh Wife Delhi : గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఢిల్లీకి వెళ్లారు. పార్టీ లైన్ దాటారన్న అధిష్టానం నోటీసులపై వివరణ ఇచ్చేందుకు రేపటితో గడువు ముగియనుంది. రాజాసింగ్ జైల్లో ఉన్నందున వివరణ ఇచ్చేందుకు మరికొంత కాలం గడువు ఇవ్వాలని రాజాసింగ్ భార్య అధిష్టానాన్ని కోరనున్నారు. అటు పీడీ యాక్ట్ నమోదు కావడంతో రాజాసింగ్‌ గత కొన్ని రోజులుగా చర్లపల్లి జైల్లో ఉన్నారు.

మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల కేసులో గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను మరోసారి అరెస్ట్ చేసిన పోలీసులు ఆయ‌న‌పై పీడీ యాక్ట్ కింద కేసు న‌మోదు చేశారు. రాజాసింగ్‌ను ఆయ‌న ఇంటి దగ్గరే అదుపులోకి తీసుకున్న మంగ‌ళ్ హాట్, షాహినాయ‌త్ గంజ్ పోలీసులు నేరుగా నాంప‌ల్లి కోర్టుకు త‌ర‌లించారు. రాజాసింగ్‌కు న్యాయ‌మూర్తి జ్యుడిషియ‌ల్ రిమాండ్ విధించగా.. పోలీసులు రాజాసింగ్ ను చర్లపల్లి జైలుకి తరలించారు.

High Court Notices MLA Rajasingh : ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైకోర్టు నోటీసులు జారీ

పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో విద్వేషాలు రెచ్చగొట్టారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరించారని పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు పెట్టారు. రాజాసింగ్ పై 2004 నుండి 101 కేసులు నమోదయ్యాయి. ఇందులో 18 మతపరమైన కేసులు ఉన్నాయి. ఓ ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ నమోదు చేయడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే తొలిసారి.