Charminar : అభిమాని అత్యుత్సాహం.. చార్మినార్‌‌పై ఎమ్మెల్సీ కవిత ఫ్లెక్సీ..

ఒక్కొక్కరు వినూత్నంగా శుభాకాంక్షలు తెలియచేస్తుంటే.. మరొక అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఫలితంగా అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకు అతను ఏం చేశాడు ? ...

Charminar : అభిమాని అత్యుత్సాహం.. చార్మినార్‌‌పై ఎమ్మెల్సీ కవిత ఫ్లెక్సీ..

Mlc Kavitha

MLC Kavitha Birthday : ఎమ్మెల్సీ కవిత పుట్టిన రోజు సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. తమకు తోచిన విధంగా వారు విషెస్ తెలియచేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. కొంతమంది అయితే.. వినూత్నంగా శుభాకాంక్షలు తెలియచేస్తుండడం అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది. వరి పంట పొలంలో ఎమ్మెల్సీ కవిత ఫొటో పట్టుకుని శుభాకాంక్షలు తెలియచేశారో ఓ రైతు. నిజామాబాద్ లో కవిత అభిమానులు ఏకంగా 12 అడుగుల భారీ చిత్రాన్ని కాయిన్స్ తో రూపొందించడం విశేషం.

Read More : MLC Kavitha : ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు? కేంద్రానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న!

ఇలా ఒక్కొక్కరు వినూత్నంగా శుభాకాంక్షలు తెలియచేస్తుంటే.. మరొక అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఫలితంగా అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకు అతను ఏం చేశాడనేగా మీ డౌట్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టిన రోజును పురస్కరించుకుని తాను కూడా వినూత్నంగా శుభాకాంక్షలు తెలియచేయాలని టీఆర్ఎస్ మొఘల్ పురా డివిజన్ అధ్యక్షులు పుప్పాల రాధాకృష్ణ అనే యువకుడు భావించాడు. అందులో భాగంగా కవిత ఫొటోతో ఫ్లెక్సీ తయారు చేయించాడు. ఏదో ఒక ప్రాంతంలో పెడితే సరిపోతుంది. కానీ.. అతను చార్మినార్ వద్దకు వెళ్లాడు.

Read More : కేసీఆర్ జన్మదినం – ఘనంగా హరిత హారం..

అక్కడున్న సెక్యూర్టీ కళ్లు గప్పి పైకి ఎక్కాడు. కవిత ఫొటోతో పాటు జన్మదిన శుభాకాంక్షలు అని రాసి ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శించాడు. కింద ఉన్న వారు ఫొటోలు తీస్తుండగా సెక్యూర్టీ సిబ్బంది గమనించి పైకి చూశారు. వెంటనే అతడిని పట్టుకుని ఫ్లెక్సీని స్వాధీనం చేసుకున్నారు. అతడిపై చార్మినార్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పుప్పాల రాధాకృష్టపై 2007లో కూడా ఇలాంటి కేసే ఒకటి నమోదు అయిందని సమాచారం. తాజా ఘటనపై చార్మినార్‌ పురావస్తు శాఖ అధికారి నీరజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చార్మినార్ పోలీసులు.