MLC Kavitha: సగర్వంగా, ధీటుగా సమాధానం చెప్పాలి – ఎమ్మెల్సీ కవిత
కోరుట్ల నియోజకవర్గంలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. కోరుట్ల టీఆర్ఎస్ పార్టీకి పెట్టని కోట అని అభివర్ణిస్తూ.. జగిత్యాల జిల్లాలోని నియోజకవర్గాలన్నీ గెలిచేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

MLC Kavitha: కోరుట్ల నియోజకవర్గంలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. కోరుట్ల టీఆర్ఎస్ పార్టీకి పెట్టని కోట అని అభివర్ణిస్తూ.. జగిత్యాల జిల్లాలోని నియోజకవర్గాలన్నీ గెలిచేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఘనత టీఆర్ఎస్ పార్టీది:
“ప్రజలు కోరిన విధంగా కోరుట్ల, మెట్ పల్లి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేసుకోగలిగాం. ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చాం. భారతదేశంలో చిత్రపటం మార్పు చేసి.. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా నంబర్ వన్‌గా నిలిపిన ఘనత టీఆర్ఎస్ పార్టీది”
సగర్వంగా, సమాధానం చెప్పాలి:
“కోరుట్లలో ఉన్న బీడీ కార్మికులకు రూ.2 వేలు పెన్షన్ ఇస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లోని బీడీ కార్మికులకు ఎందుకు ఇవ్వడం లేదు? గులాబీ కండుగా మెడలో వేసుకుని టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్, బీజేపీ నాయకుల విమర్శకులకు దీటుగా, సగర్వంగా, సమాధానం చెప్పాలి”
అవినీతి లేకుండా పాలన:
“ఎలాంటి అవినీతి లేకుండా ప్రజలకు పథకాలు అందుతున్నాయి. దేశం మొత్తంలో అవినీతి లేకుండా పాలన అందిస్తున్న నాయకులు సీఎం కేసీఆర్ మాత్రమే”
దేవుడి పేరుతో రాజకీయం:
“వాళ్లు జై శ్రీ రాం అంటే, మనం జై హనుమాన్ అనాలి. దేవుడి పేరుతో రాజకీయం చేస్తే చూస్తూ ఊరుకోం.
తెలంగాణ ఉద్యోగాలు స్థానికులకే:
“తెలంగాణ తెచ్చుకున్నది యువత కోసం. తెలంగాణలో ఉద్యోగాలు 95% స్థానికులకే వచ్చేలా చేసాం. యువత ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్దం కావాలి”
8 వేల కోట్లు రీయింబర్స్‌మెంట్:
“దళిత వర్గాలకు దళిత బందు అమలు చేస్తున్నాం. బీసీలకు విద్య కోసం గతంలో కేవలం 7000 మంది బీసి విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వ హాస్టల్ సౌకర్యం ఉంటే, ప్రస్తుతం 281 బీసి హాస్టల్ ఏర్పాటు చేసి,1300 కోట్లతో లక్షా 32 వేల బీసి విద్యార్థులను చదివిస్తున్నాం.96 లక్షల విద్యార్థులకు 8 వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చాం”
రైతులకు ఏం చెయ్యలేదు:
“టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను గ్రామాల్లో చర్చపెట్టాలి. ప్రజాస్వామ్యంలో గెలిచిన వాళ్లకు మర్యాద ఇవ్వాలి. గెలిచిన ఎంపీ అరవింద్‌కు 3 ఏళ్లు అవకాశమిచ్చినా, రైతులకు ఏం చెయ్యలేదు”
అబద్దాలకు ప్రతిరూపం అరవింద్:
“పసుపు బోర్డు బదులు తెచ్చినా ఆఫీస్ కూడా నేను తెచ్చిందే. మనం చేసిన పనులు కూడా, వాళ్ళె చేసినట్టు బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. అబద్దాలకు ప్రతిరూపం అరవింద్. అమెరికా వెళ్లి, అక్కడ కూడా అరవింద్ అబద్ధాలు చెప్తున్నాడు”
హామీలు ఏమయ్యాయి:
“మోదీ హయాంలో పెట్రోల్ నుండి నిత్యావసర వస్తువులు ధరలు భారీగా పెరిగాయి. రూపాయి విలువ భారీగా పడిపోయింది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, అందరి అకౌంట్లలో పదిహేను లక్షల రూపాయల లాంటి హామీలు ఏమయ్యాయి?”
మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందేమో”
“కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి, బీజేపీని ఎందుకు విమర్శించరు? పసుపు బోర్డు, ధరల పెరుగుదలపై బీజేపీని ఎందుకు విమర్శించరు? మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందేమో?”
రచ్చబండ నిర్వహిస్తే:
“కాంగ్రెస్ నాయకులు రైతు రచ్చబండ నిర్వహిస్తే, టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూపించండి”
జీవన్ రెడ్డిని నిలదీయాలి:
“తెలంగాణకు రావాల్సిన బకాయిల గురించి పార్లమెంటులో మాట్లాడాలని రాహుల్ గాంధీని కోరాల్సిందిగా జీవన్ రెడ్డిని ప్రజలు నిలదీయాలి”
అంటూ కోరుట్ల ప్రజలనుద్దేశించి ప్రసంగించారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ వ్యాప్తంగా మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత భారీ సభల్లో పాల్గొంటున్నారు.
- DK Aruna On PK : సికింద్రాబాద్ విధ్వంసం వెనుక పీకే హస్తం-డీకే అరుణ సంచలనం
- Harish Rao: ఆర్మీని ప్రైవేటు పరం చేసే కుట్ర: మంత్రి హరీష్ రావు
- Bndi Sanjay: సికింద్రాబాద్ విధ్వంసం ముమ్మాటికీ సీఎంఓ కుట్రే: బండి సంజయ్
- Damera Rakesh: రాకేష్ మృతికి కేంద్రమే బాధ్యత వహించాలి: మంత్రి ఎర్రబెల్లి
- Uttam Kumar Reddy: కేసీఆర్‌కు బీజేపీతో రహస్య ఒప్పందం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
1Atmakuru bypoll Counting: ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితాలు
2Kotamreddy Sridhar Reddy : ప్రతిపక్ష నేతలను వేధించొద్దు, శత్రువుల్లా చూడొద్దు-వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
3Aaditya Thackeray: ఇది సత్యానికి, అసత్యానికి మధ్య యుద్దం: ఆదిత్యా థాక్రే
4Anjali: సూర్యుడికే చెమటలు పట్టించే తెలుగు బ్యూటీ అందాలు!
5TS EAMCET-2022 : తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లు.. డౌన్లోడ్ చేసుకున్నారా?
6Teachers G.O: టీచర్ల జీవో రద్దు.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం
7Acid Bottle : బాబోయ్.. నీళ్లు అడిగితే యాసిడ్ బాటిల్ ఇచ్చిన షాపింగ్ మాల్ సిబ్బంది
8Srinidhi Shetty: భారీగా పెంచేసి చేతులు కాల్చుకున్న బ్యూటీ!
9Rocketry : ఇస్రోకు పంచాంగంతో ముడిపెట్టిన హీరో మాధవన్.. ఏకిపారేసిన నెటిజన్లు..!
10Tirumala : వసంతమండపంలో ” అరణ్యకాండ పారాయణ దీక్ష ” ప్రారంభం
-
DJ Tillu: మళ్లీ లొల్లి షురూ చేస్తోన్న డీజే టిల్లు!
-
Fastag: ఫాస్టాగ్ స్కామ్ నిజమేనా? ప్రభుత్వం ఏం చెబుతోంది?
-
E-passports : ఈ-పాస్‌పోర్టులు వస్తున్నాయి.. ఇక మీ డేటా సేఫ్.. ఎలా పనిచేస్తాయంటే?
-
Punjab : రోడ్డుపై స్టెప్పులు వేసిన F3 హీరోయిన్.. వీడియో వైరల్
-
Shah Rukh Khan: 30 ఏళ్ల సినీ కెరీర్లో షారుఖ్‌ను ‘కింగ్’ ఖాన్ చేసిన డైలాగులు ఇవే!
-
Himachal Pradesh : బర్త్ డే గిఫ్ట్ అదిరింది.. భార్యకు చంద్రుడుపై స్థలం కొన్న భర్త
-
Venkatesh: మల్టీస్టారర్‌కే చిరునామా.. సోలోగా రావా వెంకీ మామ..?
-
Apple AirPods Pro : ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రోలో హెల్త్ ఫీచర్లు.. అవేంటో తెలుసా?