తలంబ్రాలు పోసుకుంటున్న వధూవరుల నెత్తిమీద జీలకర్రా బెల్లం ఎత్తుకుపోయిన కోతి

  • Published By: nagamani ,Published On : September 12, 2020 / 01:38 PM IST
తలంబ్రాలు పోసుకుంటున్న వధూవరుల నెత్తిమీద జీలకర్రా బెల్లం ఎత్తుకుపోయిన కోతి

పెళ్లిలో పెళ్లి కూతురు..పెళ్లికొడుకు తలంబ్రాలు పోసుకునే సన్నివేశం చాలా సరదాగా ఉంటుంది. ఇరువైపులవారు వధూవరులను ప్రోత్సహిస్తుంటూ వారిద్దరూ ఒకరి తలపై మరొకరు సిగ్గులు ఒలుకుతూ తలంబ్రాలు పోసుకునే సన్నివేశం చాలా ఆనందంగా..సరదాగా ఉంటుంది. పెళ్లిలో అత్యంత సరదా సరదా ఘట్ఠం తలంబ్రాల తంతు..


అలా ఓ పెళ్లి జరుగుతోంది. వధూవరులిద్దరూ..ఒకరి తలపై మరొకరు తలంబ్రాలు పోసుకుంటున్నారు..చలోక్తులతో జరుగుతున్న ఈ ఘట్టంలోకి ఓ కోతి అనుకోని అతిథిలా వచ్చింది. ఎగిరి పెళ్లికొడుకు తలపై కూర్చుంది. ఆతరువాత పెళ్లికూతురు తలపై చేయి పెట్టింది. అంతా తెల్లబోయారు..తేరుకున్న కొంతమంది సాక్షాత్తూ ఆ ఆంజనేయస్వామే వధూవరులను ఆశీర్వదించటానికి వచ్చాడనుకుని మురిసిపోయారు.ఆ తర్వాత ఆ కోతి వధూవరుల నెత్తిమీద ఉన్న జీలకర్ర బెల్లం తీసుకొని చటుక్కుని ఎగురుకుంటూ వెళ్లిపోయింది. తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండలంలో మల్లూరు నరసింహస్వామి ఆలయంలో ఈ అరుదైన..అనుకోని ఘటన జరిగింది.



https://10tv.in/boyfriend-raped-lover-with-his-friend-and-murdered/
మల్లూరుకు చెందిన భరత్‌, నాగమణికి కొంత కాలం క్రితం పెద్దలు పెళ్లి నిశ్చయించారు. కరోనా కారణంగా ఇది వాయిదా పడింది. దీంతో మంచి ముహూర్తం నిర్ణయించి అతి తక్కువమంది బంధుమిత్రులతో గుడిలో చేయాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి సమయంలో వధూవరులిద్దరూ తలంబ్రాలు పోసుకుంటున్న సమయంలో కోతి ప్రత్యక్షమైంది. పెళ్లి కొడుకు తలపై దూకి ఆ తర్వాత పెళ్లి కూతురు తలపై దూకింది. వారి నెత్తిపై ఉన్న జీలకర్ర, బెల్లం ఎత్తుకెళ్లింది. కాగా కోతి పెళ్లికొడుకు తలపై కూర్చున్న ఘటనను అక్కడే ఉన్నవారు తమ ఫోన్ లోని కెమెరాతో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది.


ఈ ఘటన మాత్రం ఆ కొత్త దంపతులకు జీవితాంతం గుర్తుండిపోతుంది. పెళ్లి తతంగంలోని తలంబ్రాలు పోసుకునే దృశ్యాలు చూసినప్పుడల్లా ఈ ఘటన తప్పకుండా గుర్తుకొస్తుంది.