సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన దిశ నిందితుల తల్లిదండ్రులు

దిశ నిందితుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ కుమారులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేశారు.

  • Published By: veegamteam ,Published On : December 19, 2019 / 11:22 AM IST
సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన దిశ నిందితుల తల్లిదండ్రులు

దిశ నిందితుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ కుమారులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేశారు.

దిశ నిందితుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ కుమారులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేశారు. తమను చంపే ప్రయత్నం చేశారంటూ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ ఐఆర్ ను కొట్టి వేయాలని సుప్రీంకోర్టును కోరారు. తమ ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. తమ కుమారులను పోలీసులు కావాలనే ఎన్ కౌంటర్ చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. పోలీసులను చంపడానికి తమ కుమారులు ప్రయత్నం చేశారంటూ పోలీసు దాఖలు చేసిన ఎఫ్ ఐఆర్ ను కొట్టివేయాలంటూ కోర్టును కోరారు. 

సీపీ సజ్జనార్ సహా ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై విచారణ కమిషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో న్యాయ కమిషన్ ఏర్పాటు చేసింది. న్యాయ కమిషన్ ఆధ్వర్యంలోనే సీబీఐ దర్యాప్తు జరిపించాలని నిందితుల తల్లిదండ్రులు కోరారు. విచారణ కమిషన్ అందించే సాక్ష్యాలను తారుమారు చేయకుండా సీపీ సజ్జనార్ సహా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా నియంత్రించాలని పిటిషనల్ లో కోరారు. విచారణ కమిషన్ ఇచ్చే సాక్ష్యాలు పక్కాగా ఉండే విధంగా కోర్టు.. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. 

పోలీసులు నకిలీ ఎన్ కౌంటర్ చేశారు..ఎన్ కౌంటర్ లో పాల్గొన్న ప్రతి పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జ్యుడీషియల్, న్యాయ పరంగా ఇంకా పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపలేదు.. వారి దోషులని న్యాయస్థానం తేల్చలేదని..కానీ ఆ లోపే పోలీసులు వారిని ఎన్ కౌంటర్ చేశారు కాబట్టి నిందితుల కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.