Telangana Police Constable Exam Hall Tickets : ఆగస్టు28న పోలీస్‌ కానిస్టేబుల్‌ పరీక్ష..రేపటి నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌

తెలంగాణలో ఆగస్టు 28న పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్ష జరుగునున్న విషయం తెలిసిందే.  కానిస్టేబుల్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు రేపటి నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బుధవారం (ఆగస్టు17,2022) పేర్కొంది. ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు www.tslprb.in వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

Telangana Police Constable Exam Hall Tickets : ఆగస్టు28న పోలీస్‌ కానిస్టేబుల్‌ పరీక్ష..రేపటి నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌

Telangana Police Constable Exam Hall Tickets (1)

Police Constable Exam Hall Tickets : తెలంగాణలో ఆగస్టు 28న పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్ష జరుగునున్న విషయం తెలిసిందే.  కానిస్టేబుల్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు రేపటి నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బుధవారం (ఆగస్టు17,2022) పేర్కొంది.

ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు www.tslprb.in వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ హాల్ టికెట్లకు సంబంధించి ఏమైనా సందేహాలున్నా, డౌన్‌లోడ్ కాకపోయినా.. support@tslprb.inకి మెయిల్ చేయాలని.. లేదంటే 93937 11110, 93910 05006 నెంబర్లలో సంప్రదించాలని సూచించింది.

Vacancies In NIA : నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీలో ఉద్యోగ ఖాళీల భర్తీ

రాష్ట్ర వ్యాప్తంగా 15,644 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఏప్రిల్ 25,2022న నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం విధితమే. కానిస్టేబుల్‌ పోస్టులతో రవాణాశాఖలో 63 కానిస్టేబుల్‌, ఎక్సైజ్‌ అండ్‌ ప్రొబిషన్‌లో 614 కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది.

ఆయా పోస్టులకు సంబంధించి ప్రాథమిక పరీక్ష ఈ నెల 28న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. ఆయా కానిస్టేబుల్‌ పోస్టులకు 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ పేర్కొంది.