కరోనాకు కాదు.. కరెంట్ బిల్లులకు భయపడుతున్న ప్రజలు

  • Published By: dharani ,Published On : June 6, 2020 / 02:49 AM IST
కరోనాకు కాదు.. కరెంట్ బిల్లులకు భయపడుతున్న ప్రజలు

హైదరాబాద్‌లో విద్యుత్‌ బిల్లులను చూసి ప్రతీఒక్కరూ వణికిపోతున్నారు. కరెంట్ వాడినా వాడకపోయినా నెలనెలా బిల్లు పెరుగుతూ వస్తోంది. ఇప్పటి వరకు కరోనాకు భయపెడినవారు.. ఇప్పుడు చేతికందిన కరెంట్‌ బిల్లులు చూసి భయపడుతున్నారు. లాక్‌డౌన్‌ వల్ల గత మూడు నెలల నుంచి ఉపాధి లేదు. పైసా ఆదాయం లేక ఇళ్లు గడవడమే కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో భారీగా పెరిగిన ఈ బిల్లులను ఎలా చెల్లించాలో అర్థం కాక అయోమయ పరిస్థితిలో పడిపోయారు.

ఇక చాలామందికి వాడుకున్న దానికంటే ఎక్కువ విద్యుత్ చార్జీలు వస్తూ షాకులు ఇస్తున్నాయి.  రెండు లైట్లు, రెండు ఫ్యాన్లు, టీవీ ఉన్న ఇంటికి కూడా వేలల్లో బిల్లులు పంపుతున్నారు. దీంతో అందరూ విద్యుత్ చార్జీలు వాడకాని కంటే ఎక్కువగా రావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వారు మాత్రం విద్యుత్ వినియోగించిన దానికంటే ఒక్క యూనిట్‌కి కూడా ఎక్కువ బిల్లు వేయలేదని చెబుతున్నారు. 

లాక్‌డౌన్ కారణంగా మీటర్ రీడింగ్ లెక్కించకుండానే వినియోగదారులు విద్యుత్ బిల్లులు చెల్లించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్, మే నెలల బిల్లుల్ని ఇలాగే చెల్లించారు. గతేడాది ఇదే నెలలో ఎంత బిల్లు వచ్చిందో అంత మొత్తాన్ని ప్రొవిజనల్ బిల్లుగా చెల్లించారు. దీంతో బిల్లులు వేలల్లో వస్తున్నాయని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారం తప్పించాలని కోరుతున్నారు. 

Read: మీ ఇంటి దగ్గర్లోనే టెన్త్ పరీక్షలు రాసే ఛాన్స్