PM Modi: సిరిసిల్ల నేత కార్మికుడికి ప్రధాని ప్రశంస.. ‘మన్ కీ బాత్’లో ప్రస్తావించిన మోదీ.. కారణం ఏంటంటే..

తెలంగాణకు చెందిన నేత కార్మికుడిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. వచ్చే ఏడాది జరగబోయే జీ-20 సదస్సుకు ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. జీ-20 సదస్సు లోగోను నేత కార్మికుడు మగ్గంపై నేసి ప్రధానికి పంపాడు.

PM Modi: సిరిసిల్ల నేత కార్మికుడికి ప్రధాని ప్రశంస.. ‘మన్ కీ బాత్’లో ప్రస్తావించిన మోదీ.. కారణం ఏంటంటే..

PM Modi: తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నేత కార్మికుడిని ప్రధాని మోదీ ప్రశంసించారు. యెల్ది హరిప్రసాద్ అనే నేతన్న తనకు మగ్గంపై నేసిన జీ-20 లోగోను పంపినట్లు ప్రధాని వెల్లడించారు. ఆదివారం ‘మన్ కీ బాత్’లో భాగంగా ప్రధాని మోదీ ఈ విషయం తెలిపారు.

Lalu Prasad Yadav: కిడ్నీ మార్పిడి చికిత్స కోసం సింగపూర్‌కు లాలూ.. కిడ్నీ దానం చేస్తున్న లాలూ కూతురు

వచ్చే ఏడాది జరిగే జీ-20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన లోగోను ఇటీవలే ప్రధాని విడుదల చేశారు. అయితే, ఈ లోగోను నేతన్న యెల్ది హరిప్రసాద్ మగ్గంపై నేసి, ప్రధానికి పంపించారు. ఈ బహుమతి అందుకున్న ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై ‘మన్ కీ బాత్’లో మాట్లాడారు. ‘‘స్నేహితులారా.. ఈ రోజు ప్రసంగాన్ని నాకు అందిన ఒక ప్రత్యేక బహుమతి గురించి ప్రస్తావిస్తూ ప్రారంభిస్తా. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన యెల్ది హరిప్రసాద్ అనే నేతన్న.. తనే సొంతగా నేసిన జీ-20 లోగోను నాకు పంపారు. ఆ అద్భుతమైన బహుమతిని చూసి ఆశ్చర్యపోయా. ఆయన తన నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకున్నారు.

Hyderabad Metro: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో నిర్మాణం.. డిసెంబర్ 9న శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్

అంతేకాదు.. నాకు అతడు ఒక లేఖ కూడా పంపాడు. జీ-20 సదస్సుకు ఇండియా నేతృత్వం వహించడం మనందరికీ గర్వకారణమన్నాడు. తన తండ్రి నుంచి అతడికి ఈ నైపుణ్యం వచ్చినట్లు చెప్పాడు’’ అని మోదీ ప్రస్తావించారు. అంతేకాదు.. దీనికి సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించడం విశేషం.