Adilabad Rains : ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షం-ఆందోళనలో అన్నదాతలు

తుఫాన్ ప్రభావంతో  ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత రెండురోజుల నుండి అకాల వర్షం కురుస్తోంది..వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది... బోథ్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉరుములు మెరువుల

Adilabad Rains : ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షం-ఆందోళనలో అన్నదాతలు

Adilabad Rains

Adilabad Rains :  తుఫాన్ ప్రభావంతో  ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత రెండురోజుల నుండి అకాల వర్షం కురుస్తోంది..వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది… బోథ్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉరుములు మెరువులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తోంది…ఈ అకాల వర్షాలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

ఒక వైపు ఖరీఫ్ సీజన్‌లో పంట చేతికి వచ్చే సమయంలో అత్యధిక శాతం వర్షాలతో పంట దిగుబడి లేక నష్టపోతే ఈ రబీ సీజన్‌లో సైతం ఈ అకాల వర్షాలు అన్నదాతలను వదిలిపెట్టడం లేదంటూ చేతికొచ్చే మొక్క జొన్న, వేరుశనగ పంటలు కోతకు, పూతకు రావడంతో వర్షాలతో పూత రాలిపోయే ప్రమాదముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కూరగాయలు, ఆకుకూరలకు ఈ అకాల వర్షాలతో తెగుళ్లు వచ్చి పాడయ్యే అవకాశముందని ఆవేదన చెందుతున్నారు.

Also Read : Tirumala : శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

గుడిహత్నూర్ మండలానికి చెందిన రైతు విజయ్ కూడా తాను వేసిన పంటలు నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. అంతే కాకుండ ఒక పక్క ఏ కాలంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఒకే కాలంలోనే ఒక పక్క చలి,ఎండ,వానాకాలం రావడంతో చాలా ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తోందని ఈ సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులు తమ తమ ఇళ్లల్లో హ్యాపీగా గడపడానికి వెళ్లినా ఈ వర్షాలతో ఎంజాయ్ చేయకుండా పోయిందని అటు విద్యార్థులు సైతం నిరాశ చెందుతున్నారు.