Hayathnagar Rave Party : 29మంది అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు.. హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ భగ్నం

వీకెండ్ వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ లో కొంతమంది యువత మత్తులో తూగుతున్నారు. పబ్ లు, రేవ్ పార్టీలు అంటూ ఎంజాయ్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. సెలబ్రేషన్స్ పేరుతో గలీజు పనులు చేస్తున్నారు.

Hayathnagar Rave Party : 29మంది అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు.. హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ భగ్నం

Hayathnagar Rave Party : వీకెండ్ వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ లో కొంతమంది యువత మత్తులో తూగుతున్నారు. పబ్ లు, రేవ్ పార్టీలు అంటూ ఎంజాయ్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తాజాగా హయత్ నగర్ లో బర్త్ డే సెలబ్రేషన్ పేరుతో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు దాడులు చేసిన సమయంలో వారు గంజాయి మత్తులో మునిగి తేలుతున్నట్లు గుర్తించారు. హయత్ నగర్ మండలం పసుమాములలోని ఓ ఫామ్ హౌస్ లో జరుగుతున్న బర్త్ డే పార్టీలో గంజాయి వినియోగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు.. తనిఖీలు చేయగా గంజాయి పట్టుబడింది.

Also Read..Rave Party : హైదరాబాద్‌ శివారులో రేవ్ పార్టీ..12మంది యువతీయువకుల అరెస్ట్

మొత్తం 29 మంది యువకులు, నలుగురు అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 11 కార్లు, ఒక బైక్, 28 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. 50 గ్రాముల గంజాయి లభ్యమైంది. పట్టుబడిన వారంతా ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ గా గుర్తించిన పోలీసులు వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. బుధవారం మళ్లీ స్టూడెంట్స్ తో కలిసి స్టేషన్ కు రావాలని, లేకపోతే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు.

పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా.. నగర శివారులో రేవ్ పార్టీలు మాత్రం ఆగటం లేదు. పోలీసులు ముమ్మరంగా దాడులు చేస్తున్నప్పటికీ.. నిత్యం ఎక్కడో ఒక చోట గుట్టుచప్పుడు కాకుండా రేవ్ పార్టీలు నిర్వహిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హయత్ నగర్ లో రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు.

Also Read.. Police raid : బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్ పై పోలీసుల దాడులు.. అదుపులోకి తీసుకున్న వారిలో సింగర్

కొన్ని నెలల క్రితం హైదరాబాద్ నడిబొడ్డున ఓ పబ్ పై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో పలువురు ప్రముఖులు కూడా దొరికారు. ఇది అప్పట్లో పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పబ్ నిర్వహకులతో పాటు పబ్‌లో ఉన్న సుమారు 150 మందిని స్టేషన్‌కు తరలించారు. ఇందులో కొందరు సినీ రంగానికి చెందిన వారు కూడా ఉండటం కలకలం రేపింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

దాడి సమయంలో గంజాయి, కొకైన్ తోపాటు ఎల్‌ఎస్‌డీతో ఉన్న సిగరెట్లను పోలీసులు గుర్తించారు. ఈ ఘటన తర్వాత నగరంలోని అన్ని పబ్ లపై పోలీసులు నిఘా పెంచారు. సమయానికి మించి నడిపిస్తే వెంటనే సీజ్ చేస్తున్నారు. ఇక పబ్స్ విషయంలో హైకోర్టు కూడా సీరియస్ అయ్యింది. వాటిని కంట్రోల్ చేసేలా కఠినమైన ఆదేశాలిచ్చింది.