People No Mask : పెరుగుతున్న కరోనా కేసులు.. మాస్క్ లేకుండా తిరుగుతున్న జనం

కరోనా వైరస్ సెకండ్ వేవ్ కట్టలు తెంచుకుంది. నిత్యం మినిమం లక్ష మందని పలకరిస్తోంది. జనాలను ఆసుపత్రి పాలుజేస్తోంది.

People No Mask : పెరుగుతున్న కరోనా కేసులు.. మాస్క్ లేకుండా తిరుగుతున్న జనం

Rising Corona Cases People Wandering Without A Mask

People wandering without a mask : కరోనా వైరస్ సెకండ్ వేవ్ కట్టలు తెంచుకుంది. నిత్యం మినిమం లక్ష మందని పలకరిస్తోంది. జనాలను ఆసుపత్రి పాలుజేస్తోంది. అయితే.. కరోనా కేసులు పెరగడానికి కారణమేంటి… అంటే ప్రజల నిర్లక్ష్యమే కారణమనే సమాధానం వినిపిస్తుంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. ప్రజలు భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని, చేతులను శానిటైజర్లతో శుభ్రం చేసుకోవాలని ప్రభుత్వాలు, అధికారులు నెత్తీ నోరు మొత్తుకుని చెబుతున్నారు. అయినా కూడా… జనం ఈ హెచ్చరికలను పెడచెవిన పెడుతున్నారు. మాస్క్ అంటే అలంకారం కోసం.. సోషల్ డిస్టెన్స్ అంటే అదో సామాజిక రుగ్మత అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో.. పరిస్థితి చేయి దాటే స్టేజ్‌కు వచ్చింది. వైరస్‌ రోజు రోజుకు ఉధృతమవుతోందని తెలిసినా జనం మాత్రం బాధ్యారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు.

తమ సంరక్షణ, ఇతరుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని మాస్కులు ధరించాలి. కానీ కొందరు వాహనదారులు, ప్రజలు నోరు ముక్కు కప్పి ఉంచేలా మాస్కులు ధరించకుండా అలంకార ప్రాయంగా తగిలించుకుంటున్నారు. ఇక మార్కెట్‌కు వెళ్తే పరిస్థితి దారుణంగా ఉంటోంది. మాస్కులు కొందరికే పరితమమయ్యాయి. భౌతిక దూరం పాటించడం లేదు. విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఒకేసారి బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా రోడ్లమీద, మార్కెట్‌లో తిరుగుతున్నారు. దీంతో.. కరోనా కంట్రోల్ కావడం లేదు.

ఒక్క మార్కెట్లే కాదు.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జాతర్లు ఎన్నికల ప్రచార సభలు.. జనంతో కిటకిటలాడుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి రాకపోకలు పెరిగాయి. వింధులు, వినోదాలు, షాపింగులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. సాధారణ ఫంక్షన్లు ధూందాంగా జరిపించేస్తున్నారు. శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవడం మరిచిపోయారు. వీటన్నింటి కారణంగా వైరస్‌ చాపకింద నీరులా నలువైపులా విస్తరిస్తోంది.

వీకెండ్స్ వచ్చాయంటే చాలు.. నాన్ వెజ్ లేందే ముద్ద దిగని జనాలు చాలామందే ఉన్నారు. చికెన్, మటన్ షాపులకు, చేపల మార్కెట్లకు బండ్లేసుకుని, బ్యాగులు పట్టుకుని వెళ్తున్నారు కానీ.. ప్రాణాలు కాపాడే మాస్క్‌ను మాత్రం వెంట తీసుకెళ్లడం లేదు. మాటన్, చికెన్ షాపుల్లో ముచ్చట్లేస్తున్నారు కానీ.. భౌతిక దూరం పాటించడం లేదు. దీంతో.. జీహెచ్ఎంసీ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. మటన్, ఫిష్ మార్కెట్లకు మాస్తులు లేకుండా వస్తున్నవారిని గుర్తించి వేయి రూపాయలు ఫైన్ వేస్తున్నారు.

తెలంగాణలో కరోనా వైసర్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో.. కట్టడి చేసేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.స కోవిడ్ నిబంధనలపై, జాగ్రత్తలపై వారం, పది రోజులుగా విస్తృతంగా ప్రచారం చేశారు. అయినా కూడా చాలామందిలో మార్పు రాలేదు. షరా మామూలుగానే రోడ్డెక్కేస్తున్నారు. అయితే.. అలాంటి వారి తాట తీస్తున్నారు పోలీసులు. బహిరంగంగా మాస్కు లేకుండా కనిపిస్తే వేయి రూపాయల జరిమానా విధిస్తున్నారు. రోజు ఓ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో రెండు వేర్వేరు చోట్ల స్పెష‌ల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ… మాస్కులు ధ‌రించ‌కుండా క‌రోనా నిబం‌ధ‌న‌లు ఉల్లంఘిస్తున్న వారికి జ‌రిమానాలు విధిస్తున్నారు. ఈ చలానాలు ఇంటికే పంపిస్తున్నారు.

అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా… ప్రభుత్వాలు ఎంత కట్టడి చేసినా.. జనంలో మార్పు రానంతమట్టుకు పరిస్థితిలో మార్పు ఉండదు. జనాలు మాస్కులు, భౌతిక దూరం, చేతులు శుభ్రపరుచుకోవడం చేయనంత కాలం కేసులు లక్షలు కాదు కోట్లు దాటుతాయి. సో.. కరోనా కంట్రోల్‌లో ఉండాలంటే ప్రజలే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.